Rs 1000 Per Hour : పార్కింగ్ ఫీజు గంటకు రూ.1000 మాత్రమే.. రప్పాడిస్తున్న నెటిజన్స్

Rs 1000 Per Hour :  అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే గంటకు రూ.1,000 ఛార్జీని వసూలు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 6, 2024 / 04:01 PM IST

Rs 1000 Per Hour :  అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే గంటకు రూ.1,000 ఛార్జీని వసూలు చేస్తున్నారు. అక్కడ వెహికల్ పార్కింగ్ చేయడం సంగతి అలా ఉంచితే.. గంటకు రూ.1000 పార్కింగ్ ఫీజు అనే బోర్డును చూడగానే చాలామందికి దడ మొదలవుతోంది. ఈ పరిస్థితి బెంగళూరులోని యూబీ సిటీ షాపింగ్ మాల్ వద్ద ఉంది. ఆ మాల్‌లోకి మీరు ఒకవేళ కార్లో వెళితే, గంటకు రూ.1,000 పార్కింగ్ ఫీజు(Rs 1000 Per Hour) కట్టాల్సిందే. ఈ నాటు బాదుడుకు పార్కింగ్ విభాగాన్ని నిర్వహించే వాళ్లు ‘ప్రీమియం పార్కింగ్’ అనే స్మార్టు పేరును తగిలించారు.దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇంతగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వాళ్లను నెటిజన్స్ రప్పాడిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘మన బెంగళూరు ఇక అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలా మారుతోంది’’ అని ఒక నెటిజన్ ఎద్దేవా చేశాడు. ‘‘సింగపూర్, హాంకాంగ్, లండన్, దుబాయ్ లా మార్చే ప్రయత్నంలో ఉన్నారు.. అందులో భాగమే ఇది’’ అని ఇంకో నెటిజన్  సెటైర్ పేల్చాడు.  ‘‘ప్రీమియం పార్కింగ్‌లో వాహనాలకు ఏమేం సౌకర్యాలు ఉంటాయో ?’’ అని ప్రశ్నను మరొకరు లేవనెత్తారు. ‘‘ప్రీమియం పార్కింగులో కారుకు స్నానం చేయిస్తారా?  డైమండ్ ఫేషియల్ చేస్తారా?’’ అని పలువురు నెటిజన్లు నిలదీశారు. అక్కడ పార్కింగ్ చేస్తే కారుకు బ్లూ టిక్ వస్తుందేమో అని ఇంకొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ‘‘ప్రీమియం పార్కింగ్ అంటే ఏమిటి? కారు పార్కింగ్ తో పాటు 1 నెలలో డబ్బును రెట్టింపు చేసే స్టాక్ చిట్కా కూడా ఇస్తారా? ’’ అని ఒక యూజర్ అడిగారు. బెంగ ళూరులోని యూబీ సిటీ షాపింగ్ మాల్ వద్ద ఈ పార్కింగ్ ఫీజు బాదుడు  2012 సంవత్సరం నుంచే ఉందని కొందరు సోషల్ మీడియా యూజర్లు రాసుకొచ్చారు.

Also Read : Tamanna Bhatia : తమన్నా కు కోపం వస్తే వెంటనే చేసే పని అదేనట..!!

ఇంకొందరు సోషల్ మీడియా వినియోగదారులు ‘ప్రీమియం పార్కింగ్’ రేట్లను సమర్థించారు. జుగార్, ఫెరారీ లాంటి కార్లను మెయింటైన్ చేసేవాళ్లు గంటకు 1000 ఈజీగానే చెల్లించగలరని చెప్పారు.  ఆల్టో, 800, వ్యాగన్ ఆర్ మొదలైన కార్ల యజమానులు తమ ఇంట్లో పార్క్ చేసి క్యాబ్ లేదా మెట్రో లేదా బస్సులో మాల్స్‌కు వస్తే బెటర్ అని సూచించారు. రూ.కోటికిపైన ధర కలిగిన కారును వాడే వ్యక్తి గంటకు 1000 ఈజీగానే కడతాడని పలువురు కామెంట్స్ పెట్టారు. అలాంటి వాళ్లు కారు సేఫ్టీ కోసం 1000 రూపాయలు ఇవ్వగలరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరిచారు.

Also Read :BJP’s Name Game in Telangana : మూసాపేట ఇక మస్కిపేట గా మారబోతుందా..?