Site icon HashtagU Telugu

Viral : ఎమ్మెల్యే కారు కడిగిన పోలీస్.. తీవ్ర విమర్శలు

Video Of Cop Washing Shiv S

Video Of Cop Washing Shiv S

మహారాష్ట్రలో శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ (Shiv Sena MLA Sanjay) గైక్వాడ్ కారును ఓ పోలీస్ అధికారి శుభ్రం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ నేతలు పోలీస్ అధికారులను ఎలాపడితే ఆలా వాడుకుంటున్నారు. సమాజంలో పోలీసులకు ప్రత్యేక గౌరవం ఉన్నప్పటికీ..రాజకీయ నేతలు మాత్రం పోలీసులను ఓ అట బొమ్మల చూస్తుంటారు. వారికీ ఎలా కావాలంటే ఆలా వాడుకుంటుంటారు. ఇంటి పని దగ్గరి నుండి వంట పని వరకు అన్ని చేయించుకుంటుంటారు. తాజాగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కారును ఒక పోలీసు అధికారి శుభ్రం చేసిన ఘటన ఇప్పుడు విమర్శల పాలుచేస్తుంది. మహారాష్ట్ర పోలీసులకే అవమానమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పోలీస్‌ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ సంఘటన దీనికి ఉదాహరణ అని అన్నారు. ఇది ఎంతో అవమానకరమని మండిపడ్డారు. మరోవైపు వైరల్‌ అయిన వీడియో క్లిప్‌పై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పందించారు. దీనిపై వివరణ ఇచ్చారు. భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీస్‌ అధికారి అల్పాహారం తిన్న తర్వాత ఆ కారులో వాంతి చేసుకున్నట్లు తెలిపారు. దీంతో ఆ పోలీస్‌ అధికారి స్వయంగా ముందుకు వచ్చి ఆ కారును క్లీన్‌ చేసినట్లు చెప్పారు. కారును కడమని ఎవరూ కూడా ఆ పోలీస్‌ను బలవంతం చేయలేదని అన్నారు.

Read Also : Devara : 125 మిలియన్స్ ను చుట్టేసిన ‘చుట్టమల్లే’ సాంగ్