Viral : సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. “తన కళ్లను ప్రతిరోజూ ఉదయం తన మూత్రంతో శుభ్రం చేసుకుంటానంటూ” ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇది వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
నుపుర్ పిట్టీ అనే మహిళ తనను “మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్”గా పరిచయం చేసుకుంటూ, ఈ వారం ప్రారంభంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో “యూరిన్ ఐ వాష్ – ప్రకృతి ప్రసాదించిన ఔషధం” అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె స్వయ మూత్రంతో కళ్లను శుభ్రం చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ వీడియోపై నెటిజన్లతో పాటు వైద్య నిపుణులు కూడా తీవ్రంగా స్పందించారు. ఇటువంటి అసాధారణ ప్రక్రియలు ప్రమాదకరమని, శాస్త్రీయ ఆధారాలు లేని ప్రకృతి వైద్యాలను గుడ్డిగా అనుసరించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా, మూత్రంతో కళ్లను శుభ్రం చేయడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
“ఇది శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే చర్య. కళ్లలో ఇన్ఫెక్షన్, కంటి చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి మార్గాలను ప్రోత్సహించకూడదు,” అని ఓ ప్రసిద్ధ నేత్ర వైద్య నిపుణుడు హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రతి వీడియోను నమ్మకూడదని, ఆరోగ్య సంబంధిత విషయాల్లో తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!