AI Dance : ఎలాన్ మస్క్ .. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ట్విట్టర్ (ఎక్స్) సహా ఎన్నో పెద్ద వ్యాపారాలకు యజమాని అయినా ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఎలాన్ మస్క్ ఒక వీడియోతో ‘ఎక్స్’లో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీ గీస్’ బృందం ‘స్టేఇన్ అలైవ్’ అనే ర్యాంప్ సాంగ్‌కు వేసిన డ్యాన్స్ గతంలో ఎంతో జనాదరణ పొందింది. ఆ పాటకు ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఒక ఏఐ వీడియోను తయారు చేసి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఆ వీడియోను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘మా ఇద్దరిని (ట్రంప్, మస్క్) ద్వేషించే వాళ్లు దీన్ని ఏఐ అని చెబుతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మా డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయా ? ఎలా డ్యాన్స్ చేశామో చెప్పండి’’ అని నెటిజన్లకు ఒక ప్రశ్నను కూడా మస్క్(AI Dance) సంధించారు.
Best campaign video ever. @elonmusk and @realDonaldTrump have moves! pic.twitter.com/F41ewxJy9o
— Mike Lee (@BasedMikeLee) August 14, 2024
We’re now on WhatsApp. Click to Join
ఈ ఏఐ డ్యాన్స్ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 కోట్ల మందికిపైగా చూశారు. మరెంతో మంది దీన్ని షేర్ చేశారు. ఇంకెంతో మంది ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్ పెట్టారు. ట్రంప్, మస్క్ జోడీపై రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగోలా ట్రంప్‌ను గెలిపించేందుకు ఎలాన్ మస్క్ బాగానే కష్టపడుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలాన్ మస్క్ రిపబ్లికన్ పార్టీకి భారీగా విరాళం కూడా ఇచ్చారు. తన సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ వేదికగా ట్రంప్‌కు మంచి ప్రచారం కూడా మస్క్ కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్‌ను స్వయంగా ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఎంతో ఆసక్తికర ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూను రసవత్తరంగా కొనసాగించారు. అందుకే ఆ వీడియోను అప్‌లోడ్ చేసిన కొన్ని క్షణాల్లో లక్షలాది మంది చూశారు.