Flight Tire Fall : నడి ఆకాశంలో ఊడిన విమానం టైరు.. ఏమైందంటే ?

Flight Tire Fall : బోయింగ్‌ 777 విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది.

  • Written By:
  • Updated On - March 8, 2024 / 02:37 PM IST

Flight Tire Fall : బోయింగ్‌ 777 విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాలకే విమానం ఎడమ భాగంలోని టైరు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో చోటుచేసుకుంది. యునైటైడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777 విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి టేకాఫ్‌ అయిన వెంటనే విమానం ఎడమ భాగంలోని టైరు ఊడిపోయింది. దీంతో అలర్ట్ అయిన పైలట్లు లాస్‌ఏంజిల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాన్ని దారిమళ్లించారు. అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో పెనుముప్పు తప్పింది. విమానంలోని 249 మంది ఊపిరి పీల్చుకున్నారు. ఎడమ భాగంలోని టైరు లేకపోవడంతో.. ఆ వైపు విమానం నేలపై రాపిడికి గురై మంటలు వచ్చాయి. అప్పటికే మోహరించి సిద్ధంగా ఉంచిన ఫైరింజన్లు ఆ మంటలను ఆర్పేశాయి.  టైరు ఊడిన ఈ విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అందులోని  ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించారు.

We’re now on WhatsApp. Click to Join

టైరు ఊడిన ఈ విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఇక ఊడిపోయిన  విమానం టైరు(Flight Tire Fall) శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని పార్కింగ్‌ కేంద్రంలో నిలిపి ఉంచిన కారుపై పడింది. దీంతో ఆ కారు కిటికీ అద్దం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. విమానంలోని టైర్లకు నష్టం జరిగినా లేదా ఊడిపోయినా సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేలా  దాన్ని నిర్మించారని విమానయాన సంస్థ యునైటైడ్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. అందువల్లే ల్యాండింగ్‌లో ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొంది.  బోయింగ్‌ 777 విమానాలకు కుడి, ఎడమ భాగాల్లోని మెయిన్‌ ల్యాండింగ్‌ గేర్ల వద్ద పన్నెండు టైర్లు ఉంటాయి. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ విభాగం దర్యాప్తు చేస్తోంది.

Also Read :  Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..

కొన్నాళ్ల క్రితం అమెరికాలో ఓ విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది.  అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ విమానం డోర్‌ ఊడిపోయింది. ఊడిన డోర్‌ పక్కనే ప్రయాణికుల సీట్లు ఉండగా కొందరి ఫోన్లు బయటకు ఎగిరిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Also Read :Congress: కాంగ్రెస్ పార్టీలోకి మల్లా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి..?