Site icon HashtagU Telugu

19024 Feets Height : ఎవరెస్టును మించిన హైట్ ను ఎక్కేసిన బుడతడు

19024 Feets Height Youngest Child

19024 Feets Height Youngest Child

19024 Feets Height : హైట్ అనగానే మనకు ఎవరెస్ట్ గుర్తుకొస్తుంది.17,498  అడుగుల హైట్ లో ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు వెళ్లడమే చాలా కష్టం. కానీ ఓ మూడున్నరేళ్ల కుర్రాడు  ఏకంగా 19,024 అడుగుల ఎత్తులోని ఉమ్లింగ్‌ లా పాస్‌ను ఎక్కాడు.  కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్‌ రెహ్మాన్‌ తన పేరెంట్స్ తౌహీద్‌ రెహ్మాన్‌, జష్మియాలతో కలిసి ఉమ్లింగ్‌ లా పాస్‌ను అధిరోహించాడు. ఈ ముగ్గురూ ఆగస్టు 15న బైక్‌పై సూలియా నుంచి బయలుదేరి 19 రోజుల్లో 5వేల కిలోమీటర్లు ప్రయాణించి సెప్టెంబరు 2న లద్దాఖ్‌లో ఉన్న ఉమ్లింగ్‌ లాకు చేరుకొని, అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Also read : DSC Notification: 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ లో పరీక్ష..!

ఉమ్లింగ్‌ లా ప్రాంతంలోని చిషుమ్లే నుంచి దెమ్‌చోక్‌ వరకు ఉండే 52 కిలోమీటర్ల మార్గమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు. ఇక్కడ ఆక్సిజన్‌ మోతాదు సాధారణ స్థాయితో పోలిస్తే 43శాతమే ఉంటుంది. అయినా ప్రతికూలతలను అధిగమించి అక్కడికి జజీల్‌ రెహ్మాన్‌ చేరుకోవడం విశేషం. ఇంతకుముందు గురుగ్రామ్‌కు చెందిన ఏడున్నరేళ్ల బాలుడు ధిమానీ పారేట్ ఉమ్లింగ్‌ లాను అధిరోహించాడు. ఇప్పుడు ఆ రికార్డును మూడున్నరేళ్ల జజీల్ (19024 Feets Height – Youngest Child) తిరగరాశాడు. ఉమ్లింగ్‌ లాను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు.