Names Vs Songs: మనిషికి ఆస్తులు ఉండకపోవచ్చు.. అంతస్తులు ఉండకపోవచ్చు.. కానీ పేరు మాత్రం ఉంటుంది. పేరే.. మనిషికి గుర్తింపును ఇస్తుంది. ఇతరులు మనిషిని గుర్తించేది కూడా పేరుతోనే. ఒకవేళ మనుషుల పేర్లు ఒకేలా ఉంటే.. ఇంటి పేరుతో లేదంటే తల్లిదండ్రుల పేర్లతో వాళ్లను గుర్తిస్తారు. మొత్తం మీద ‘పేరు’ అనేది ప్రతీ మనిషి గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుంటుంది. అలాంటిది మనదేశంలోని ఒక వెరైటీ ఊరిలో ఏ ఒక్కరికీ పేర్లు లేవు. అందుకే వారిని పాట పాడి పిలుస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన పాట ఉంటుంది. ఆ పాట పాడితే అతగాడు తననే పిలుస్తున్నారని గుర్తిస్తాడు. వెంటనే రిప్లై ఇస్తాడు. ఆ ఊరి వివరాలివీ..
Also Read :Friendly Female Robots : అందాల రాశుల్లా ఆడ రోబోలు.. దుమ్మురేపుతున్న అరియా, మెలోడీ
- మనం ఆ ఊరి గురించి తెలుసుకోవాలంటే ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాకు వెళ్లాలి.
- ఆ వింత గ్రామం పేరు కోంగ్‌థాంగ్ (Kongthong). ఇది రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నుంచి 60 కి.మీ దూరంలో ఉంటుంది.
- ఈ ఊరిలో బిడ్డ పుట్టగానే వాళ్ల అమ్మ ఒక రాగాన్ని వాయిస్తుంది. ఆ రాగమే వాళ్లకు పేరుగా మారిపోతుంది. అదే రాగంతో ఆ బిడ్డను పిలుస్తారు.
- కొంగ్‌థాంగ్ గ్రామంలోని 700 మంది ప్రజలకు పేర్లు లేవు. ఏదో ఒక రాగం లేదా పాటతో(Names Vs Songs) వారిని పిలుస్తుంటారు.
- ప్రతి ఒక్కరికి పెట్టే పాటల పేర్లలో రెండు రకాలు ఉంటాయి. మొదటి రకంలో పెద్ద పాట ఉంటుంది. రెండో రకంలో చిన్నపాటి పాట ఉంటుంది. చిన్నపాటి పాట ద్వారా ఇంట్లో వాళ్లు పిలుస్తారు. పెద్ద పాటల ద్వారా బయటివాళ్లు పిలుస్తారు.
- కొంగ్‌థాంగ్ ప్రజలు తోటి గ్రామస్తులకు ఏదైనా చెప్పదలిస్తే విజిల్స్ వేస్తారు. విజిల్స్‌తోనే విషయాలన్నీ చెప్పుకుంటారు. అందుకే దీన్ని ‘విజిల్ విలేజ్’ అని పిలుస్తారు.
- కొంగ్‌థాంగ్ గ్రామంలోని ప్రజలంతా ఫైవ్‌స్టార్ ఖోంగ్‌సిట్, ఖాసీ తెగకు చెందినవారే.
- తమ పేరును పాట ద్వారా పిలుచుకోవడం అంటేనే ఈ ఊరివాళ్లకు బాగా ఇష్టం.
- పిల్లలకు నామకరణం చేయడాన్ని పండుగలా చేసుకునే మనదేశంలో ఇలాంటి ఊరు కూడా ఒకటి ఉందని చాలామందికి తెలియదు.