Khiladi Lady : పోలీసులనే బెదిరిస్తున్న కిలాడీ లేడీ

Khiladi Lady : కొన్నిరోజుల తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పింది. కానిస్టేబుల్ సహాయం చేయలేనని చెప్పగానే, అతడిపై వేధింపుల ఆరోపణలు పెట్టి తన మాటలు నమ్మేలా చేసేందుకు

Published By: HashtagU Telugu Desk
Khiladi Lady

Khiladi Lady

ఈ మధ్య కొంతమంది ఆడవారు కిలాడీ లేడీస్ (Khiladi Lady) గా మారుతున్నారు. మాయమాటలు చెప్పి అందిన దగ్గరికి దోచుకోవడమే కాదు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే రివర్స్ లో కేసు లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సామాన్య వారినే కాదు పోలీసులను సైతం బెదిరిస్తూ డబ్బులు లాగుతున్నారు. ఆ మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌ను ఓ యువతి తన మాయాజాలంలోకి లాక్కొంది. మొబైల్ ఫోన్ పోయిందని, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని భావిస్తూ కానిస్టేబుల్ వద్ద ఫోన్ తీసుకుని కాల్ చేసింది. ఆతర్వాత అతడికి మెసేజ్‌లు పంపిస్తూ పరిచయం పెంచుకుంది. కొన్నిరోజుల తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పింది. కానిస్టేబుల్ సహాయం చేయలేనని చెప్పగానే, అతడిపై వేధింపుల ఆరోపణలు పెట్టి తన మాటలు నమ్మేలా చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. భయపడిన కానిస్టేబుల్ ఆమెకు రూ.40,000 ఇచ్చి తప్పించుకున్నాడు.

Build Now App : ఇక పై ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు

హోంగార్డ్‌ను కూడా మోసం

ఇది ఒక్కటే కాదు అదే ప్రాంతంలో ఓ హోంగార్డ్‌ను కూడా ఇదే విధంగా మోసం చేసింది. ముందుగా ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుని, తర్వాత వారి సహాయాన్ని కోరుతూ డబ్బులు అడిగింది. సహాయం అందకపోవడంతో తనను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఈ విషయంపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టారు. కానీ, తన చీకటి కార్యాలను బయటపెట్టొద్దని బెదిరిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.

ఆమె అసలు కథ ఇది!

దర్యాప్తులో పోలీసులు అనేక షాకింగ్ నిజాలను గుర్తించారు. ఈ 25 ఏళ్ల యువతి వరంగల్‌కు చెందిన మహిళ. డిగ్రీ చదివినా, చట్టాన్ని తన ప్రయోజనాలకు వాడుకోవడం మాత్రమే తెలుసుకుంది. అవసరాలను తీర్చుకోవడానికి ఆమె పోలీసులను లక్ష్యంగా చేసుకుని వారిని మోసం చేయడం మొదలుపెట్టింది. భయపెట్టడం, బెదిరించడం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తానని బెదిరించి లక్షలాది రూపాయలు దోచుకురావడం ఆమె సాధారణ వ్యాపారంగా మార్చుకుంది.

Mahabubabad : పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చిన పోలీసులు

పోలీసుల దర్యాప్తులో మరిన్ని నిజాలు వెలుగు

పోలీసుల దర్యాప్తులో వరంగల్‌లోనూ ఇలాంటి మోసాలకు పాల్పడిందని తేలింది. బాధితులు ఎంత మంది ఉన్నారనేది ఇప్పటికీ గుర్తించాల్సిన విషయం. ఇలాంటి మోసగాళ్లకు ఎదురుగా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఇలాంటి మోసగాళ్ల బారినపడకుండా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులే ఇలాంటి మోసాలకు బలవుతున్నారంటే, సాధారణ ప్రజలు ఎంతటి సవాళ్లను ఎదుర్కొంటారో ఊహించుకోవచ్చు.

  Last Updated: 07 Mar 2025, 07:09 PM IST