Rs 6000 Crore Dump: ఈ చెత్తకుప్పలో రూ.6,500 కోట్ల బిట్‌కాయిన్లు.. కొనేందుకు టెకీ రెడీ

బిట్‌కాయిన్ రేటు రోజురోజుకూ పెరిగిపోతోంది. వాటి విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.6,500 కోట్లు(Rs 6000 Crore Dump).

Published By: HashtagU Telugu Desk
Rs 6000 Crore Bitcoins Dump James Howells Uk Computer Engineer

Rs 6000 Crore Dump: ఆ చెత్తకుప్ప అలాంటిది ఇలాంటిది కాదు. దానిలో ఉన్న ఒక వస్తువులో రూ.6,500 కోట్లు విలువైన కీలకమైన సమాచారం ఉంది. ఇంతకీ అదేమిటి ? అది చెత్తకుప్పలోకి ఎలా చేరింది ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Kalvakuntla Kavitha: జగిత్యాల సీటుపై కవిత ఫోకస్.. టార్గెట్ అసెంబ్లీ

ఏమిటీ మిస్టరీ.. 

  • జేమ్స్ హోవెల్స్‌.. బ్రిటన్‌కు చెందిన కంప్యూటర్ ఇంజినీర్.
  • హోవెల్స్ 2013లో 8వేల బిట్‌కాయిన్లను కొన్నాడు. వాటి సమాచారాన్ని, బిట్‌కాయిన్ వాలెట్ వివరాలను ఆ హార్డ్‌డ్రైవ్‌లో ఉన్నాయి.
  • బిట్‌కాయిన్ రేటు రోజురోజుకూ పెరిగిపోతోంది. వాటి విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.6,500 కోట్లు(Rs 6000 Crore Dump).
  • జేమ్స్ హోవెల్స్‌ వ్యాపార భాగస్వామి పొరపాటున ఆ హార్డ్‌ డ్రైవ్‌‌ను చెత్తలో పారేశారు.
  • ఆనాటి నుంచి తన హార్డ్‌ డ్రైవ్‌‌ కోసం, అది పడి ఉన్న చెత్త కోసం జేమ్స్ హోవెల్స్‌ వెతుకుతున్నారు.
  • జేమ్స్ హోవెల్స్‌ నివసించే ఏరియాలోని చెత్తను సౌత్‌వేల్స్‌లో ఉన్న న్యూపోర్ట్‌ సిటీ కౌన్సిల్‌ డంపింగ్ యార్డులో వేస్తుంటారు.
  • ఆ డంపింగ్ యార్డును మూసివేస్తామని  ఇటీవలే న్యూపోర్ట్‌ సిటీ కౌన్సిల్‌ అధికార యంత్రాంగం ప్రకటించింది.
  • ఆ భూమిలో కొంతభాగాన్ని సోలార్‌ ఫామ్‌ ఏర్పాటుకు కేటాయిస్తామని వెల్లడించింది.
  • దీంతో ఆ డంపింగ్ యార్డులోని చెత్తకుప్పలో దాగిన తన హార్డ్‌ డ్రైవ్‌‌ను వెతకడం వీలుపడదని జేమ్స్ హోవెల్స్‌ గుర్తించాడు.
  • చెత్తలో కలిసిపోయిన తన విలువైన హార్డ్‌ డ్రైవ్‌‌ను వెతుక్కునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు.  అయితే అందుకు కోర్టు నో చెప్పింది.
  • దీంతో ఆ డంపింగ్ యార్డులోని చెత్తను కొనేందుకు జేమ్స్ హోవెల్స్‌ రెడీ అయ్యాడు.
  • దాదాపు లక్ష టన్నుల చెత్తను కొనేందుకు ఆయన సిద్ధమయ్యారు.
  • డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే బిట్‌కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఒకానొక దశలో దాని విలువ 1 లక్ష డాలర్లకు చేరగా, ప్రస్తుతం దాని రేటు 96వేల డాలర్ల దరిదాపుల్లో ఉంది.

Also Read :Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?

  Last Updated: 13 Feb 2025, 11:47 AM IST