Romance : వెరైటీ గా శృంగారం చేద్దామనుకొని భార్యనే చంపేసిన భర్త

Romance : జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న భాస్కర్ (34) తన భార్య శశికలతో మద్యం సేవించి బ్యాండేజ్ శృంగారానికి ప్రయత్నించాడు

Published By: HashtagU Telugu Desk
Bandage Romance

Bandage Romance

తమిళనాడు(Tamilanadu)లోని హోసూరు పట్టణంలో ఓ దంపతుల మధ్య జరిగిన వెరైటీ శృంగారం (Romance) విషాదాంతం (Sad Ending) అయ్యింది. జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్న భాస్కర్ (34) తన భార్య శశికలతో మద్యం సేవించి బ్యాండేజ్ శృంగారానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో శశికల చేతులు, కాళ్లు, మెడను తాడుతో బిగ్గరగా కట్టాడు. దీంతో ఉపిరిడక శశికళ ముక్కు నుండి రక్తం వచ్చింది. వెంటనే ఆమెను హాస్పటల్ కు తీసుకెళ్లగా..ఆమె ఉపిరిడక చనిపోయిందని డాక్టర్స్ తెలిపారు.

Balakrishna : బాలకృష్ణ సెటైర్లు వేసింది చిరంజీవి పైనేనా..?

ఈ ఘటనపై భాస్కర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. మద్యం తాగిన తర్వాత శృంగారం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించాడు. కానీ శశికల తండ్రి ఆరుల్ మాత్రం దీనిని పూర్తిగా ఖండించాడు. భాస్కర్ తన కుమార్తెను తరచూ వేధించేవాడని, రూ.14 లక్షల కట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడని ఆరోపించారు. దీంతో భాస్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దంపతులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 4 సంవత్సరాలు, మరొకరి వయసు 2 సంవత్సరాలు. తల్లి అకాల మరణం, తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో చిన్నారుల భవితవ్యం అనిశ్చితంగా మారింది. శృంగారంలో విచిత్ర ప్రయోగాలు చేసే జంటలు..అప్పుడప్పుడు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అనేదానికి ఇదో ఉదాహరణ నిలుస్తుంది.

  Last Updated: 05 May 2025, 05:32 PM IST