Suspected of sorcery.. Five members of the family were killed : దేశం రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి చెందుతున్న..మూఢనమ్మకాలు , చేతబడులు (Sorcery ) మాత్రం ప్రజలు మరచిపోవడం లేదు. ప్రతి రోజు మూఢనమ్మకాలు, చేతబడులతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. చేతబడి, బాణామతి, చిల్లంగి, మంత్రాలు ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో పిలుస్తారు. వాస్తవానికి అవన్నీ కల్పితాలు. రుజువుకు నిలబడి నమ్మకాలు. చేతబడి బాణామతి, మంత్రాలు చేస్తున్నారనే నెపంతో మూఢనమ్మకాల కారణంగా వారిని వెలివేయడం, పండ్లూడగొడ్డడం, మలమూత్రాలను తాగించడం వంటి హింసలకు గురి చేస్తూ, వారిపై దాడులు, హత్యలు ఇంకా సజీవ దహనాలు కూడా చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లోని సుక్మా జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. చేతబడి చేశారనే అనుమానంతో కుంట పీఎస్ పరిధి ఇట్కల్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. వారు చేతబడి చేయడంతోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని భావించిన మరో కుటుంబం వీరిని దారుణంగా హతమార్చింది. కర్రలతో దాడికి పాల్పడడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులను మౌనం కన్న, మౌసం బుచ్చా, మౌసం బిరీ, కర్క లచ్చి, మౌసం అర్జోగా గురించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ సైతం సందర్శించారు. నిందితులతో పాటు స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాధిత కుటుంబం కొంతకాలంగా గ్రామస్తుల నుంచి అవమానాలతో పాటు ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నట్లుగా ప్రాథమికంగా తెలిసిందన్నారు. గ్రామంలో పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం.. ఈ అనర్థాలకు బాధిత కుటుంబమే కారణంగా పేర్కొంటూ టార్గెట్ చేసినట్లు తెలుస్తున్నది.
Read Also : Harish Rao : నువ్వు ఎక్కడ దాక్కున్నావ్..హరీష్ రావు అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం