Site icon HashtagU Telugu

Sunday Holiday : ఆదివారం జంతువులకు కూడా సెలవు.. ఓ ఆవు కోసం.. ఎక్కడో తెలుసా?

Sunday Holiday for Animals also Details Here

Sunday Holiday for Animals also Details Here

ఆదివారం (Sunday) అంటే ఎవ్వరైనా రిలాక్స్( relax ) అవ్వాలనే కోరుకుంటారు. హాయిగా తిని, కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. పక్క మీదనుంచి పదింటి వరకు లేవనివాళ్లు, టీవీ లు, ఫోన్లు వదలని వాళ్ళు, బ్రేక్ ఫాస్ట్ లంచ్ కలిపేసి బ్రంచ్ గా చేసి బద్ధకంగా ఉండేవాళ్ళే అందరూ. మనుషులు సరే.. మరి జంతువులు.. వాటికి కూడా సెలవు వర్తిస్తుందా.. ఎస్.. ఉంది.. మన సెలవు వాటికి ఇవ్వడం కాదు వాటికే ఒక ప్రతేకమైన సెలవు (Holiday) రోజు ఉంది. ఎక్కడో తెలుసా.. మన దేశంలోకి జార్ఖండ్ రాష్ట్రంలో.

జార్ఖండ్‌ (jharkhand) లోని లతేహర్ గ్రామంలో.. జంతువులకు ఆదివారం సెలవు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆ రోజున ప్రజలు వాటికి అసలు పని చెప్పరు. వాటిని రిలాక్స్ గా ఉండనిస్తారు. రోజంతా విశ్రాంతి ఇచ్చేస్తారు. ఆవులు, గేదెల నుంచి పాలు కూడా తీసుకోరు. జంతువుల నుండి ఆరోజు ఏదైనా తీసుకోవడం, వాటి చేత పని చేయించుకోవడం నేరంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ సంప్రదాయం ప్రారంభం కావడం వెనక ఓ విషాద గాధ ఉంది.

సుమారు వందేళ్ల కిందట పొలంలో పనిచేస్తూ ఓ ఆవు చనిపోయింది. అకస్మాత్తుగా ఆవు మరణించడంతో ఊరంతా బాధ పడింది.. అప్పుడే ఆదివారం జంతువులకు సెలవు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించారు. అదే ఫాలో అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం లతేహార్ గ్రామానికి దగ్గర్లోనే ఉన్న మరో 5 గ్రామాల్లో కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నారు.

 

Also Read : Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ