Site icon HashtagU Telugu

Condoms : ఒక్కడే 2023 లో 9940 కండోమ్స్ ఆర్డర్ చేసాడట..

South Delhi Consumer Ordere

South Delhi Consumer Ordere

రేపటి తో 2023 కు ముంగిపు పలకబోతున్నాం..కొత్త ఏడాదికి (2024) గ్రాండ్ గా వెల్ కం (Wel Come) చెప్పేందుకు యావత్ ప్రజానీకం సిద్ధం అవుతున్నారు. ఇదే తరుణంలో న్యూ ఇయర్ వేడుకల కోసం గ్రాండ్ గా ప్లాన్స్ చేస్తున్నారు. ఇక 2023 లో జరిగిన పలు ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వస్తూ..అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇందులో కండోమ్స్ సేల్స్ కు సంబదించిన ఆసక్తికర విషయాన్నీ బ్లింకిట్ (Blinkit) తెలిపి వార్తల్లో నిలిచింది. ప్రముఖ ఆన్లైన్ స్టోర్ బ్లింకిట్ ‘2023 బ్లింకిట్ ట్రెండ్స్’ (2023 Blinkit Trends) రిలీజ్ చేసింది. ఇందులో సౌత్ ఢిల్లీకి చెందిన వ్యక్తి ఏకంగా 9940 కండోమ్స్ ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

వినియోగదారులు కోరుకున్నదే తడవు నిమిషాల వ్యవధిలో ఆయా వస్తువులను ఇంటి ముంగిటికి తెచ్చి అందించే బ్లింకిట్.. 2023లో తాము సరఫరా చేసిన కొన్ని రకాల వస్తువుల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వినియోగదారుడు 9940 కండోమ్ లు ఆర్డర్ చేశాడట. అలాగే బ్లింకిట్ వివిధ వినియోగదారులకు 30,02,080 పార్టీ స్మార్ట్ టాబ్లెట్లను సరఫరా చేసింది. రాత్రి మందు కొట్టాక, పొద్దున హ్యాంగోవర్ ఉండకుండా ఈ టాబ్లెట్లను వాడతారు. గురుగ్రామ్ లో వినియోగదారులకు ఈ ఏడాది 65,973 లైటర్లను బ్లింకిట్ అందజేసింది.

అలాగే బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు 1,59,900 రూపాయల విలువ చేసే ఐఫోన్ 15 ప్రో మాక్స్ తో పాటుగా ఒక లే చిప్స్ ప్యాకెట్ నూ, ఆరు అరటిపళ్లనూ ఆర్డర్ చేసాడని తెలిపింది. ఇక ఈ ఏడాది పొడవునా అర్థరాత్రి దాటాక తాము 3,20,04, 725 మ్యాగీ ప్యాకెట్లను సరఫరా చేశామని పేర్కొంది. ఇక హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి 2023లో పలు దఫాలుగా 17,009 కేజీల బియ్యాన్ని ఆర్డర్ చేసాడని.. అలాగే ఒక వ్యక్తి ఒకే నెలలో 38 అండర్ వేర్లను బ్లింకిట్ ద్వారా తెప్పించుకోగా, మరొకరు 972 మొబైల్ చార్జర్లను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. వీటి అన్నింట్లో 9940 కండోమ్ లు ఆర్డర్ చేసిన వ్యక్తి గురించే అంత మాట్లాడుకుంటున్నారు. కొంతమంది రొమాంటిక్ గా వీడు మామూలోడు కాదు అని కొంతమంది వీడు చాల హాట్ గురు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Hyderabad Metro: నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో పరుగులు