Great Wall of China : దారికి అడ్డొచ్చిందని.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు !

Great Wall of China : వాళ్లు ఏకంగా ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను ఓ చోట తవ్వేశారు. 

Published By: HashtagU Telugu Desk
Great Wall of China

Great Wall of China

Great Wall of China : వాళ్లు ఏకంగా ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను ఓ చోట తవ్వేశారు. తమ టౌన్ షిప్ నుంచి ఒక అడ్డదారిని తయారు చేసేందుకు.. అడ్డొచ్చిన చారిత్రక కట్టడం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏరియాలోనూ తవ్వకాలకు తెగబడ్డారు. కొన్ని గోడలను కూలగొట్టారు.   చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌ యూయు కౌంటీ లోని యాంగ్‌క్యాన్హె టౌన్‌షిప్‌ సమీపంలో  చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది.  ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌కు ఉన్న గ్యాప్‌ను పెంచేందుకు ఆగస్టు 24న భారీగా తవ్వకాలు జరిపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మార్గంలో షార్ట్‌కట్‌ దారిని క్రియేట్ చేసేందుకే ఇలా తవ్వకాలు జరిపామని ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.

Also read : Dr . Sarvepalli Radhakrishnan Birthday Special : దేశం గర్వించిన టీచర్

ప్రపంచంలోనే పేరొందిన 21,196 కిలోమీటర్ల ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ సమగ్రత, సుస్థిరతకు వీరు తీవ్ర నష్టం చేశారని ఆఫీసర్లు చెప్పారు.యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ లలో ఒకటైన గ్రేట్‌వాల్‌ కు నష్టం కలిగేలా చేశారని వాపోయారు. తవ్వకాలు జరిపిన ఇద్దరు వ్యక్తులను నిర్మాణ పనిని కాంట్రాక్టుకు తీసుకున్న వారిగా గుర్తించారు. తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను 32 గ్రేట్‌వాల్‌ అని పిలుస్తారు. 1368-1644 సమయంలో మింగ్‌ వంశీయులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను (Great Wall of China)  నిర్మించారు.

  Last Updated: 05 Sep 2023, 10:49 AM IST