అహ్మదాబాద్(Ahmedabad )లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India crash) దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 241 మంది చనిపోయారు. మృతుల్లో 169 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ మరియు కొంతమంది కెనడియన్లు ఉన్నారు. అలాగే ఈ ప్రమాదంలో 12 మంది విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ప్రమాదంలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే విమానం విమానాశ్రయం వెలుపల ఉన్న మెడికల్ కాలేజ్ భవనం పై కూలడంతో ఆ సమాయంలో అక్కడ ఉన్న మెడికల్ విద్యార్థుల్లో 24 మంది మృతిచెందినట్టు అధికారులు ధృవీకరించారు. అలాగే పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం పూర్తిగా దగ్ధమైనా, అందులో ఉన్న భగవద్గీత (Shrimad Bhagavad Gita) మాత్రం చెక్కుచెదరలేదు. ఒక్క పేజీ కూడా కాలిపోకుండా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గీతా గ్రంథం ఏమాత్రం కాలిపోకుండా బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
A passenger aboard the ill-fated AirIndia flight was carrying a copy of the Bhagavad Gita. In a remarkable turn, the sacred book was found intact and unharmed amidst the wreckage at the crash site. 🙏 pic.twitter.com/VBu4jYuvIi
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 13, 2025