RS 2 Lakhs Saree : బంగారు పూత పూసిన ఆ చీర ఏకంగా 2 లక్షల 25వేల రూపాయలకు సేల్ అయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతకారుడు మహ్మద్ తబీష్ తయారు చేసిన ఈ చీరను ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఉంచగా రికార్డు ధరకు సేల్ అయింది. ఈ తరహా చీరలను మొఘలుల కాలం నుంచే తమ పూర్వీకులు తయారు చేస్తున్నారని మహ్మద్ తబీష్ చెప్పారు. బంగారు పూత పూసిన జరీతో వర్క్ చేసిన నాలుగు చీరలను తీసుకురాగా అన్నీ సేల్ అయ్యాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
చీర స్పెషాలిటీ..
- ఈ చీర తయారీకి వాడిన నూలుకు బంగారు పూత పూసిన జరీతో ఎంబ్రాయిడరీ వర్క్స్ చేశారు.
- ఈ చీర తయారీకి మూడు నెలల టైం పట్టింది.
- దీని తయారీ క్రమంలో కూలీల ఖర్చులు మూడు నెలల పాటు చెల్లించాల్సి వచ్చింది.
- ఈ చీర ఏళ్ల తరబడి పాడవ్వకుండా ఉండేందుకు 6 నెలలకోసారి సూర్యరశ్మి తాకేలా పెట్టాలి.
- ఒకవేళ 6 నెలలకోసారి సూర్యరశ్మి తాకేలా పెట్టకపోతే చీర లోపల క్రిమికీటకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
- ఈ చీరను ధరించిన ప్రతిసారి డ్రై క్లీనింగ్‌కు(RS 2 Lakhs Saree) ఇవ్వాలి.