పాక్ మాజీ క్రికెటర్ మాలిక్ (Malik) నుంచి విడాకులు (Divorce) తీసుకున్న సానియా మీర్జా మళ్లీ పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సనా జావేద్ (Sana Javed) అనే నటిని మాలిక్ రెండో పెళ్లి చేసుకోవడం తో.. ఆమె మాజీ భర్త ఉమైర్ జస్వాల్ (Umair Jaswal)..సానియాను పెళ్లి చేసుకున్నాడనే ఓ వార్త హల్చల్ చేస్తుంది.
సానియా మీర్జా ( Sania Mirza ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హైదరాబాద్ కు చెందిన ఈమె .. అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. దాదాపు 15 ఏళ్ల పాటు తన కెరియర్ ను కొనసాగించిన.. మీర్జా ( Sania Mirza ).. తన వ్యక్తిగత జీవితంలో తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఆమెను అనేక అవమానాలకు… వివాదాలకు కెరీర్ఫ్ గా నిలిచేలా చేసాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులే కాదు యావత్ భారతీయులు కూడా తట్టుకోలేకపోయారు. అప్పటివరకు అభిమానించిన వారంతా ఆమెను ఛీ కొట్టడం చేసారు. కొంతకాలంగా మాలిక్ – సానియా కాపురం బాగానే సాగుగా..బిడ్డలు పుట్టినా తర్వాత విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఈ మధ్యనే విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న నెల రోజులకే… షోయబ్ మాలిక్ మరో వివాహాన్ని చేసుకున్నాడు. పాకిస్తాన్ దేశానికి చెందిన నటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే షోయబ్ మాలిక్ రెండు వివాహాలు చేసుకోగా ఇది మూడవ వివాహం. అటు సనా జావేద్ కు రెండవ వివాహం. అప్పటికే పాకిస్తాన్ దేశానికి చెందిన సింగర్ ఉమైర్ జస్వాల్ కు విడాకులు ఇచ్చింది నటి సనా జావేద్. కాగా ప్రస్తుతం సానియా టర్కీ పర్యటనలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సానియా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సానియాతో పాటు ఆమె స్నేహితులు ఉన్నారు. ఈ క్రమంలో సానియా రెండో వివాహం చేసుకుందనే వార్త వైరల్ గా మారింది. పాకిస్తాన్ గాయకుడు, సనా జావేద్ మాజీ భర్త ఉమేష్ జస్వాల్ నే ఈమె పెళ్లి చేసుకుందని అంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. అలాగే జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది ఆమెనే తెలపాలి.
Read Also : Heavy Rains In AP: ఏపీలోని ఐదు జిల్లాలకు వరద ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!