కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఓ రష్యన్ మహిళ (Russian Woman) తన ఇద్దరు చిన్న పిల్లలతో గుహలో నివసిస్తూ ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. గస్తీ అధికారులు కొండపై గుహ ముఖద్వారంలో వేలాడుతున్న దుస్తులు గుర్తించి, ప్రమాదకరమైన మార్గంలో వెళ్లగా, బంగారు జుట్టుతో చిన్నారి పరిగెత్తుతూ రావడం వారిని ఆశ్చర్యపరిచింది. ఇది పాములు తిరిగే అటవీ ప్రాంతం కావడంతో, పోలీసు బృందం అప్రమత్తమైంది.
Parliament : రాజ్యసభ – లోక్‌సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది..?
40 ఏళ్ల నీనా కుటినా అనే రష్యన్ మహిళ, తన పిల్లలు ప్రేమ (6), అమా (4) తో కలసి ఆ గుహలో నివసిస్తోంది. ఆమె తపస్సు చేస్తున్నానని, శ్రీకృష్ణుడు తనను ధ్యానం చేయమని పంపాడని తెలిపింది. పాండురంగ విఠల విగ్రహానికి పూజ చేస్తూ జీవిస్తున్న ఈ మహిళ స్థానికంగా కొంతమంది వద్ద నుంచి కూరగాయలు, నూడుల్స్, సలాడ్ వంటి వస్తువులను తెచ్చుకుని, కట్టెలతో వంట చేసుకుంటున్నారు. స్థానిక పోలీసులు ఆమె పాస్‌పోర్టు పోయినట్టు తెలిపినా, అనంతరం అటవీ అధికారులు దాన్ని గుర్తించారు.
నీనా వీసా గడువు 2017లోనే ముగిసినప్పటికీ, ఆమె భారత్ నుంచి వెళ్లిపోకుండా గుహలో తపస్సు చేస్తున్నట్లుగా జీవించడమే కాక, 2018లో నేపాల్ వెళ్లి మళ్లీ తిరిగి రావడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఆమెను ఓ మహిళా ఆశ్రమానికి తరలించగా, పిల్లలను చిల్డ్రెన్ హోంకు పంపించారు. తదుపరి బెంగళూరులోని విదేశీ పౌరుల నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్లి, అవసరమైన ప్రక్రియల అనంతరం రష్యాకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటన ఒక వైపు వలస జీవన పరిస్థితుల విషాదకథను, మరోవైపు విశ్వాసాలపై ఆధారపడిన జీవన విధానాన్ని తెలుపుతోంది.