Site icon HashtagU Telugu

RTC Bus Theft : టికెట్ కు డబ్బులు లేవని ఏకంగా RTC బస్సునే దొంగతనం చేసాడు

Bus Chori

Bus Chori

సాధారణంగా ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేసేటప్పుడు చేతిలో డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేస్తాం..ఒకవేళ డబ్బులు లేకపోతే ఎవర్నైనా అడిగి తీసుకుంటాం..కానీ ఇక్కడ ఓ వ్యక్తి బస్సు టికెట్ కు డబ్బులు లేవని చెప్పి ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లాడు..అది కూడా తన భార్య ను తీసుకరావడానికి..ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్ దుర్గయ్య డ్యూటీకి వెళ్లగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన దుర్గయ్య భార్యను చూసేందుకు బయల్దేరాడు. అయితే బస్ టికెట్కు డబ్బుల్లేవట.ఏంచేయాలో అర్ధం కాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఎవరినైనా అడిగితే బాగోదని చెప్పి ..ఆలోచిస్తున్నాడు. ఆ పక్కనే పార్కింగ్ చేసి ఉన్న బస్సు కనిపించింది. అంతే స్వతహాగా లారీ డ్రైవర్ కావడం తో..పార్కింగ్ చేసి ఉన్న బస్సు ను ఎత్తుకెళ్లాడు. స్వయంగా బస్సు ను నడుపుకుంటూ అత్తగారింటికి వెళ్ళాడు. బస్సు నడుపుకుంటూ వచ్చిన భర్త ను చూసి భార్య షాక్ లో పడింది. బస్సు ఎక్కడిది..అని భార్య ప్రశ్నించగా..జరిగింది చెప్పాడు. ఇంతలో బస్సు మిస్ అయ్యిందని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా..పోలీసులు బస్సు జాడను తెల్సుకొని బస్సు ను ఎత్తుకెళ్లిన దుర్గయ్య ను అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Srinagar News: జమ్మూలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి