Rent A Boyfriend : ‘‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభిస్తాడు’’ అని రాసి ఉన్న పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్చర్‌కు ఎంతో విలువను ఇచ్చే మన దేశంలో అద్దెకు బాయ్ ఫ్రెండ్‌ను ఇచ్చే వ్యాపారాలు మొదలు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలను నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వివరాలివీ..
Also Read :Ration Cards Update: రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్ల చేరిక.. కొత్త అప్‌డేట్
కించపరిచేందుకే ఏర్పాటు చేశారా ?
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరిగింది. దేశంలోని మెట్రో నగరాల్లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ భారీ రేంజులోనే జరుగుతుంటాయి. ప్రత్యేకించి పలువురు టెకీలు, సంపన్న వర్గాల పిల్లలు ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకుంటారు. ఇతరత్రా సాధారణ నేపథ్యాలు కలిగిన వారు సాదాసీదాగానే వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఆర్థిక పరిమితుల కారణంగా హంగామాలకు, విలాసాలకు తావు ఇవ్వరు. ఫిబ్రవరి 14న కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న బనశంకరి, బీడీఏ కాంప్లెక్స్ సహా పలు ఏరియాల్లో ‘‘అద్దెకు బాయ్ ఫ్రెండ్(Rent A Boyfriend) దొరుకుతాడు’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు యువతులను, మహిళలను కించపరిచేలా ఉన్నాయనే అభిప్రాయం బెంగళూరు నగర ప్రజానీకంలో వ్యక్తమైంది. రూ.389కే బాయ్ ఫ్రెండ్ అని ఆ పోస్టర్‌లో రాశారు. అదే బెంగళూరు నగరంలోని పలు లగ్జరీ రెస్టారెంట్లలో బిర్యానీ కూడా అంతే రేటులో దొరుకుతోంది. అలాంటప్పుడు బిర్యానీ రేటుకే బాయ్ ఫ్రెండ్‌ను ఎలా సమకూరుస్తారు ? ఇది తప్పకుండా ప్రేమికులను కించపరిచే దురుద్దేశంతో ఏర్పాటు చేసిన పోస్టరే అయి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అద్దెకు బాయ్ ఫ్రెండ్ పోస్టర్‌పై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దాని ఆధారంగా ఆ పోస్టర్లను అంటించిన వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులను బెంగళూరు నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read :Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?
కులమతాలకు అతీతం..
జపాన్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈవిధంగా బాయ్ ఫ్రెండ్‌లను, గర్ల్ ఫ్రెండ్‌లను అద్దెకు ఇచ్చే అనైతిక వ్యాపారాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ దేశాలకు ఒక నిర్ణీత కల్చర్ లేదు. భారత్‌కు ఒక మహోన్నత కల్చర్ ఉంది. అందుకే ఇక్కడ అలాంటి అనైతిక మార్గాలు చెల్లుబాటు కావు. భారతీయ సామాజిక విలువలను పరిరక్షించేందుకు ప్రతీ ఒక్కరు కుల,మతాలకు అతీతంగా ఏకం కావాలి.