Ranveer Allahbadia: ‘‘మీ తల్లిదండ్రులు శృంగారం చేస్తున్న సమయంలో.. చూస్తావా?’’ అంటూ సోనీ లివ్‌లో ప్రసారమయ్యే ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’లో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. యావత్ నెటిజన్లు రణవీర్ కామెంట్స్‌ను తప్పుపడుతున్నారు. తల్లిదండ్రుల లైంగిక సంబంధంపై అతడు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రణవీర్ అలహాబాదియా ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేసినందుకు, అతడిపై, ఇండియాస్ గాట్ లేటెంట్ షోపై పోలీసులకు కంప్లయింట్ అందింది.
ఇద్దరు లాయర్లు..
ముంబైకు చెందిన లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు ముంబై పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్లకు ఈ ఫిర్యాదులు ఇచ్చారు. రణవీర్ అలహాబాదియా(Ranveer Allahbadia) సహా ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’లో పాల్గొన్న ఇతర కామిక్స్‌పై ఎఫ్ఐఆర్ వేయాలని సదరు లాయర్లు డిమాండ్ చేశారు. వారి వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు.
మహారాష్ట్ర సీఎం సీరియస్
ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సీరియస్ అయ్యారు. ‘‘ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. అయితే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు, మన స్వేచ్ఛ ముగిసిపోతుంది’’ అని సీఎం కామెంట్ చేశారు. ‘‘భారతీయ సమాజానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే అది తప్పు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Also Read :Gold From Electronics : ఎలక్ట్రానిక్ స్క్రాప్ నుంచీ గోల్డ్.. శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’లో అసలు ఏం జరిగింది ?
- రణవీర్ అలహాబాదియా బీర్ బైసెప్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
- ఇండియాస్ గాట్ లేటెంట్ షోను సమయ్ రైనా నిర్వహిస్తున్నారు. ఇది సీజన్ 8 వరకు కలర్స్ టీవీలో ప్రసారమైంది. సీజన్ 9 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం చేస్తున్నారు.
- ఈ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాతో పాటు రణవీర్ అలహాబాదియా పాల్గొన్నారు.
- ఈ షోలో ఒక కంటెస్టెంట్‌కి రణవీర్ అలహాబాదియా వేసిన ప్రశ్న వివాదానికి దారితీసింది.
- ‘‘మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితం మొత్తం చూస్తావా? లేక ఒకసారి జాయిన్ అయ్యి, జీవితం మొత్తం చూడకుండా ఉంటావా?” అని రణవీర్ అలహాబాదియా అడిగారు. ఆ షోలో పాల్గొన్న వారంతా ఈ మాటలు విని షాక్ అయ్యారు. సమయ్ రైనా కూడా షాక్ అయ్యారు. ‘‘రణ్‌వీర్‌కు ఏమైంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
- షోలో పాల్గొన్నవారంతా రణవీర్ మాటలను ఫన్నీగా తీసుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.