Site icon HashtagU Telugu

Viral : 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Viral

Viral

Viral : ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, వైద్య సర్జరీలు వంటి కారణాలతో చాలామంది రెండు కంటే ఎక్కువ మందిని కనలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లోనే రాజస్థాన్‌లో ఓ మహిళ ఏకంగా 17 మంది పిల్లలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లా, లీలావాస్ గ్రామానికి చెందిన కవారా రామ్ కల్బెలియా – రేఖ కల్బెలియా (55) దంపతులిద్దరూ సాధారణ కార్మిక కుటుంబం. తాజాగా 55 ఏళ్ల వయసులో రేఖ, జాడోల్ బ్లాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీరికి 16 మంది పిల్లలు ఉన్నారు. అందులో నలుగురు మరణించగా, ప్రస్తుతం 12 మంది పిల్లలు జీవించి ఉన్నారు. ఇప్పుడు మరో బిడ్డ పుట్టడంతో మొత్తం 13 మంది సజీవ సంతానం ఉన్నట్లు అయింది.

Jammu Kashmir : ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

కవారా రామ్ కల్బెలియా స్క్రాప్ డీలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అప్పులు చేసి కొంతమంది పిల్లల వివాహాలు జరిపించాడు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలకు ఇప్పటికే పెళ్లి అయింది. వారికి కూడా పిల్లలు పుట్టారు. ఈ విధంగా రేఖ ఇప్పటికే అమ్మమ్మగా మారినా కూడా మళ్లీ బిడ్డకు జన్మనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పిల్లల సంఖ్య ఎక్కువైనా, కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిసింది.

ముఖ్యంగా, ఎవ్వరినీ స్కూల్‌కి పంపలేదని కవారా చెప్పాడు. ఈ ప్రసవాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రోషన్ దరంగి మాట్లాడుతూ, రేఖ తమతో ఇది నాల్గవ సంతానం అని అబద్ధం చెప్పిందని తెలిపారు. తర్వాతే ఆమెకు ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారని తెలిసిందన్నారు. ఆమెకు చాలా ప్రసవాలు జరగడంతో గర్భాశయం బలహీనపడే ప్రమాదం, అధిక రక్తస్రావం కారణంగా ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరించారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతం తల్లి, శిశువు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

Brixton Crossfire 500 XC: ఈ బైక్‌పై భారీగా డిస్కౌంట్‌.. ధ‌ర ఎంతంటే?

Exit mobile version