Rain Free In Cafe : కేఫ్‌లు ఎన్నెన్నో ఉంటాయి. అయితే మనం చెప్పుకోబోయే కేఫ్ మాత్రం చాలా స్పెషల్. అక్కడ కాఫీ తాగితే వర్షం ఫ్రీ. ఇంతకీ ఎందుకు ? ఆ కేఫ్‌లో కాఫీకి, వర్షానికి ఉన్న లింకేంటి ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Republic Day 2025 : రిపబ్లిక్ డే పరేడ్.. త్రివిధ దళాలు, నారీశక్తి శకటాలు అదుర్స్
వర్షం.. ఇది వాతావరణంతో లింకున్న అంశం. వాతావరణం అనుకూలిస్తేనే వర్షం పడుతుంది. కానీ మనం చెప్పుకోబోయే రెస్టారెంటులో రోజూ వర్షం కురుస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా ? మరేం లేదు.. అది ‘రెయిన్ థీమ్డ్ కేఫ్’. నిత్యం అక్కడ వర్షం కురుస్తూనే ఉంటుంది. రోజులో 24 గంటల పాటు వర్షపు జల్లులను కురిపించేందుకు ఈ కేఫ్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. కృత్రిమ వర్షాన్ని కురిపిస్తుండటం వల్లే అందులో వర్షం అనేది సీజన్‌తో సంబంధం లేకుండా పడుతూనే ఉంటుంది. వర్షపు జల్లులను చూస్తూ తాపీగా కాఫీ తాగాలంటే(Rain Free In Cafe) ఆ రెస్టారెంటుకు వెళ్లాల్సిందే. అయితే ఇది మన దేశంలో లేదు.
Also Read :Tik Tok Race : టిక్‌టాక్ కొనుగోలు రేసులో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ కంపెనీ
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇటావోన్ ప్రాంతంలో ఈ కేఫ్ ఉంది. దీని పేరు ‘రెయిన్ రిపోర్ట్’. నిత్యం అక్కడ వర్షం కురుస్తుంటుంది కాబట్టి దీనికి ‘రెయిన్ రిపోర్ట్’ అనే పేరును పెట్టారు. ఈ కేఫ్‌లో మనం కూర్చున్న టేబుల్‌పై కాఫీ కప్పును పెట్టగానే వర్షం పడటం మొదలవుతుంది. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీని తాగేయొచ్చు. ఈ కేఫ్ చుట్టూ ఎత్తైన వెదురు చెట్లు ఉంటాయి. ఈ ఉల్లాసభరిత వాతావరణంలో కాఫీ తాగితే ఆ మజాయే వేరప్ప. వాస్తవానికి ఈ కేఫ్‌లో ప్రతి పదిహేను నిమిషాలకోసారి కృత్రిమ వర్షాన్ని కురిపిస్తుంటారు. ఈ కేఫ్‌లోకి వచ్చే వారికి గొడుగులు, రెయిన్‌కోట్లు, బూట్లు అందిస్తారు. ఎంతోమంది స్నేహితులు, సహోద్యోగులు, లవర్స్, దంపతులు ఈ కేఫ్‌కు వచ్చి కాఫీ తాగి ఎంజాయ్ చేస్తుంటారు.