Site icon HashtagU Telugu

Railway Employee – Molesting : 11 ఏళ్ల బాలిక ఫై రైల్వే ఉద్యోగి లైంగిక వేదింపులు..చితకబాదిన తోటిప్రయాణికులు

Harassment

Harassment

Railway Employee Thrashed to Death on Delhi-Bound Humsafar Express Train : దేశ వ్యాప్తంగా (India) మహిళలకే (Woman) కాదు అభం శుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరవైంది. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఉన్నత పదవిలో ఉన్న వారి దగ్గరి నుండి సామాన్య జనాల వరకు అంత కామంతో కళ్ళుమూసుకొని ఏంచేస్తున్నారో..ఎక్కడ ఉన్నామో..ఇలాంటి స్థితిలో ఉన్నామో అనేది కూడా చూడడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో లైంగిక దాడులు (Molesting) అనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా రైలు ప్రయాణం చేస్తున్న 11 ఏళ్ల బాలిక ఫై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడడంతో తోటి ప్రయాణికులు చితకబాదారు. దీంతో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బిహార్​కు చెందిన ఓ కుటుంబం ఢిల్లీ వెళ్లేందుకు హమ్​సఫర్ రైలు (Humsafar Train) ఎక్కారు. జనరల్ టికెట్లు తీసుకున్న వారు, టీటీఈ వద్ద అనుమతి తీసుకుని ఏసీ కోచ్​-డీలో కూర్చున్నారు. అయితే ప్రయాణ మార్గంలో ఆ కుటుంబం వద్దకు రైల్వే ఉద్యోగి, ఆ కోచ్ అటెండెంట్ (Coach Attendant)​ ప్రశాంత్ కుమార్ (Prashanth Kumar) రాత్రి వచ్చారు. అదే సమయంలో బాధితురాలి తల్లి వాష్ రూమ్​కు వెళ్లింది.

ఇదే అదనుగా తీసుకున్న ప్రశాంత్ కుమార్, బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే తల్లి రాగా బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. అదే రైలులో ఉన్న తన భర్తకు బాధితురాలి తల్లి జరిగినదంతా చెప్పినప్పుడు తోటి ప్రయాణికులు విన్నారు. అంతే తీవ్ర ఆగ్రహంతో నిందితుడిని దారుణంగా కొట్టారు. గురువారం వేకువజామున కాన్పుర్ సెంట్రల్ స్టేషన్‌కు రైలు చేరుకోగానే జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు. జీఆర్పీ సిబ్బంది ప్రశాంత్‌ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే తీవ్రమైన గాయాలతో ఉన్న అతడిని స్థానిక హాస్పటల్ కు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైల్వే ఉద్యోగి చనిపోయాడు.

Read Also  :  Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?