Site icon HashtagU Telugu

Manorama Khedkar: మనోరమ ఖేద్కర్‌ జైలు నుంచి పరుగో పరుగు

Manorama Khedkar

Manorama Khedkar

Manorama Khedkar: రైతులను బెదిరించిన కేసులో పూజా ఖేద్కర్ తల్లి మనోరమ దిలీప్ ఖేద్కర్‌కు ఊరట లభించింది. పూణే అదనపు సెషన్స్ కోర్టు నుంచి బెయిల్ పొందడంతో ఆమె ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలైంది. ఈ సమయంలో ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మీడియా కెమెరాల నుంచి తప్పించుకుని పారిపోతున్నట్లు కనిపిస్తుంది. రైతును బెదిరించిన కేసులో మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌కు చెందిన మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కూతురు పూజ ఖేద్కర్ ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న సమయంలో మనోరమ ఖేద్కర్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ఐఏఎస్‌గా మారిన పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ కీలక చర్య తీసుకుంది. యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అలాగే యూపీఎస్సీ పరీక్షకు హాజరుకాకుండా జీవితకాల నిషేధం విధించారు. పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది.

వివాదం ఏంటంటే.. ముల్షి ప్రాంతానికి చెందిన రైతుల భూమిని విక్రయించాలని బలవంతం చేసింది. మనోరమా ఖేద్కర్‌ కొందరు రైతులను బెదిరించినట్లు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంలో మనోరమపై కేసు నమోదైంది. దీని తర్వాత మనోరమ మరియు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ హఠాత్తుగా కనిపించకుండా పోయారు. ఆ తర్వాత మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను బెదిరించేందుకు ఉపయోగించిన పిస్టల్‌ను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్