Site icon HashtagU Telugu

Viral Wedding Card : దయచేసి పెళ్లికిరాకండి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వెడ్డింగ్ ఇన్విటేషన్

Print Mistake in Wedding Card goes viral

Print Mistake in Wedding Card goes viral

వాట్సాప్(Whatsapp) మెసేజ్ లు, ఇన్‌స్టా(Instagram) పోస్టులు, ఈ మెయిల్(E Mail) లలో ఒక్కోసారి చిన్న పదం తప్పుగా టైప్ చేస్తే.. దాని మొత్తం అర్థమే మారిపోతుంది. అయితే ఇది స్మార్ట్ యుగం కాబట్టి తప్పుగా పదాలను టైప్ చేస్తే దానిని డీఫాల్ట్ గా సరిచేస్తుంది. కానీ పేపర్(Paper) పై ప్రింట్ అయింది మళ్లీ మార్చాలంటే కాని పని. దానిని కొట్టివేసో లేక.. మరోసారి ప్రింట్ చేయడమో చేయాలి. ఆ తప్పు జీవితంలో ఒకేఒక్కసారి జరిగే పెళ్లి పత్రికపై(Wedding Card) జరిగితే ? మొత్తం బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అపార్థం చేసుకోవడం, నవ్వుల పాలవ్వడం ఖాయం.

దయచేసి అందరూ పెళ్లికి వచ్చి ఆశీర్వదించడానికి ‘పెళ్ళికి రావడం మర్చిపోకండి’ అని రాయడానికి బదులుగా.. ‘పెళ్లికి రావడం మర్చిపోండి’ అని వివాహ ఆహ్వానపత్రికపై ప్రింట్ చేశారు. దాంతో ఆ పెళ్లిపత్రిక కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. నెటిజన్లు దానిపై జోకులు పేలుస్తున్నారు.

పెళ్లంటే చాలా పనులుంటాయి. అలంకరణ, వివాహ వస్త్రాలు, పెళ్లి పత్రిక, విందు ఇలా ప్రతిదీ పక్కా ప్లాన్ ప్రకారం చేస్తారు. అంతా బాగానే చేసినా.. ఓ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో మాత్రం చిన్న పొరపాటు జరిగింది. పెళ్లి కార్డును ఎంతో కవితాత్మకంగా హిందీ భాషలో రాశారు. అంతా బాగానే ఉంది. చివరిలో మాత్రం ‘ హే మనస్ కే రాజన్స్ తుమ్ భూల్ జానా ఆనే కో (ఈ ఆహ్వానాన్ని ప్రేమతో పంపుతున్నాను. దయచేసి పెళ్లికి రావడం మర్చిపోండి)’ అని ప్రింటయ్యింది.

దయచేసి పెళ్లికి రావడం మర్చిపోకండి అనడానికి బదులుగా మర్చిపోండి అని ప్రింట్ అయింది. ఆ కార్డులను చెక్ చేసుకోకుండానే బంధుమిత్రులందరికీ పంపడంతో అతిథులు కార్డ్ చూసి తెల్లమొహాలు వేశారు. వివాహానికి ఆహ్వానిస్తున్నారా? లేదా రావొద్దని చెబుతున్నారో? తెలియక సందిగ్ధంలో పడిపోయారు. ఇక ఈ కార్డ్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. పెళ్లికి ఇలా కూడా ఆహ్వానం పంపుతారా ? అరే.. మాకీ విషయం తెలియలేదే.. అంటూ నెటిజన్లు ఆ పెండ్లి పత్రికపై జోకులు పేలుస్తున్నారు.

 

Also Read ;    Viral Video: మోడీజీ నా స్కూల్ పరిస్థితి చూడండి: వైరల్ వీడియో