Viral Video: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి వాహనం ఛేజ్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో డ్రగ్స్‌ వ్యాపారులను ఆంధ్రా సరిహద్దు వరకు వెంబడించి రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు బుధవారం తెలిపారు.

Viral Video: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో డ్రగ్స్‌ వ్యాపారులను ఆంధ్రా సరిహద్దు వరకు వెంబడించి రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు బుధవారం తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో చిత్రకొండ పోలీసులు డ్రగ్స్‌ వ్యాపారులను వెంబడించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

చిత్రకొండ ప్రాంతంలోని రేఖపల్లి గ్రామ సమీపంలో గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆదివారం నిఘా సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్మగ్లర్లను పట్టుకోవడానికి మా బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుందని చిత్రకొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐఐసి తెలిపారు. పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు 20 కిలోమీటర్లకు పైగా వెంబడించారు.

పోలీసుల నుంచి తప్ప్పించుకునే క్రమంలో డ్రగ్స్ స్మగ్లర్లు పోలీసు వాహనానికి అడ్డుగా గంజాయి మూటలు విసిరారు. వీడియో చూస్తున్నంత సేపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని దారకొండ గ్రామ సమీపంలో గంజాయి వాహనం వదిలి పారిపోయారు. 45 లక్షల విలువ చేసే 950 కిలోల గంజాయితో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి విచారిస్తున్నారు. పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గ్రూపులుగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. చిత్రకొండ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు 20(బి) (ii) (సి) మరియు 25 ఎన్‌డిపిఎస్ యాక్ట్ కింద కేసు (177/23) నమోదు చేశారు.

Also Read: Sharmila: చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్నికల్లోనే మీ సీటును త్యాగం చేయండి: కేటీఆర్ కు షర్మిల పంచ్