విజయవాడ కనక దుర్గమ్మ (Kanaka Durga Temple) సన్నిధిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులు పేకాట ఆడుతూ (Temple, police Officers playing poker) కెమెరాకు చిక్కారు. నలుగురు సీఐలు పేకాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. గత ప్రభుత్వంలో దేవి ఉత్సవాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి అలాంటి తప్పులు తమ హయాంలో అస్సలు జరగకూడదని సీఎం చంద్రబాబు..ఆలయ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై అరా తీస్తూ వస్తున్నారు. గత నాల్గు రోజులుగా భక్తులు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఏర్పాట్లు బాగున్నాయని కితాబు ఇస్తూ వస్తున్నారు.
అలాగే పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారి సన్నిధిలో డ్యూటీ చేయడానికి వచ్చిన కొంతమంది పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుగురు సీఐలు దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి వచ్చారు. అయితే..వాళ్లు విధులను పక్కకు పెట్టి, లాడ్జీ రూమ్ లలో పేకటాలు ఆడుతూ కెమెరా కు అడ్డంగా దొరికిపోయారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో భక్తులతో పాటు ప్రజలు పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేకాట ఆడుతున్న వారిలో టూ టౌన్ సీఐ కొండల్ రావు, పెనుకొండ సీఐ రాయుడుతో పాటు మరో ఇద్దరు సీఐలు ఉన్నారు. పోలీసుల వీడియో వ్యవహారం ఉన్నతాధికారుల వరకూ వెళ్లినట్లు సమాచారం. దీనిపై అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలిసింది.
కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి కామన్!
దుర్గగుడిలో డ్యూటీ కోసం వచ్చి పేకాడుతున్న నలుగురు సీఐలు!#AndhraPradesh #YSRCongressParty #TeluguDesamParty #Vijayawada #JaganannaConnects pic.twitter.com/v25sid2vQI
— Jagananna Connects (@JaganannaCNCTS) October 7, 2024
Read Also : Devara : దేవర 10 డేస్ కలెక్షన్స్ ..ఎన్టీఆరా..మజాకా