PMO Imposter Case: పీఎంఓ అధికారిని అంటూ కోట్లలో డీల్

ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారిగా చెప్పుకుని వివాదంలో ఉన్న ఓ కంటి ఆస్పత్రికికి సంబంధించి 16 కోట్లకు పైగా జప్తు చేసిన అహ్మదాబాద్ కు చెందిన మయాంక్ తివారీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. పీఎంఓ రంగంలోకి దిగి ఈ కేసుని సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

PMO Imposter Case: ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారిగా చెప్పుకుని వివాదంలో ఉన్న ఓ కంటి ఆస్పత్రికికి సంబంధించి 16 కోట్లకు పైగా జప్తు చేసిన అహ్మదాబాద్ కు చెందిన మయాంక్ తివారీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. పీఎంఓ రంగంలోకి దిగి ఈ కేసుని సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

మయాంక్ తివారీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సీబీఐ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇండోర్‌లోని ఆసుపత్రితో ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి తాను ప్రధానమంత్రి కార్యాలయం అధికారినని చెప్పడంతో విషయం బయటకు వచ్చింది.

తప్పుడు సమాచారంతో పలు వివాదాల్లో చిక్కుకున్న మయాంక్ తివారీపై కేంద్రం ఫైర్ అయింది. ఈ మేరకు అతనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన ఇండోర్‌లోని ఓ ఆసుపత్రి ప్రమోటర్లపై ఒత్తిడి తెచ్చి రూ.16 కోట్ల బకాయిల విషయంలో ప్రధాని మంత్రి కార్యాలయంలో పని చేసే అధికారిని అంటూ నమ్మబలికించాడు.ఈ కేసులో అహ్మదాబాద్‌లోని మయాంక్ తివారీ నివాసాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఈ సందర్భంగా ఏజెన్సీ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సీబీఐ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసింది.

వివాదంలో ఉన్న ఆస్పత్రి విషయంలో తలదూర్చి కోట్ల రూపాయల డీల్ కోసం మొబైల్ ఫోన్ నుండి కాల్స్ మరియు ఎస్ఏంఎస్ ల ద్వారా ప్రధాని కార్యాలయం పేరును వాడుకున్నాడు. ఈ విషయం పీఎంవోకు తెలియడంతో వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా పీఎంవో పేరును దుర్వినియోగం చేసిన కేసు అని సీబీఐకి పీఎంవో తెలిపింది. పీఎంవోలో పేర్కొన్న పోస్టులో మయాంక్ తివారీ పనిచేయడం లేదని పీఎంవో తన ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: Black Sesame Seeds: చలికాలంలో నల్ల నువ్వులు ఎంత మేలు చేస్తాయో తెలుసా..?