Plane Door Horror : 16,325 అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం కిటికీ

Plane Door Horror : ఆ విమానం రన్‌వే నుంచి గాల్లోకి టేకాఫ్ అయిన కాసేపటికే దాని తలుపులలో ఒకటి తెరుచుకుంది. 

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 02:59 PM IST

Plane Door Horror : ఆ విమానం రన్‌వే నుంచి గాల్లోకి టేకాఫ్ అయిన కాసేపటికే దాని తలుపులలో ఒకటి తెరుచుకుంది.  దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులు టెన్షన్‌కు గురయ్యారు.  ఈ చేదు అనుభవం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు  చెందిన ‘బోయింగ్ 737-9 మ్యాక్స్’ విమానంలోని ప్యాసింజర్లకు ఎదురైంది. ఈ విమానం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియోకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోలను విమానంలోని ప్రయాణికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. ఆ వీడియోలను బట్టి విమానంలో ఉన్న మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ తెరుచుకున్నట్లు స్పష్టంగా  కనిపించింది. విమానం నుంచి ఎగ్జిట్ డోర్ పూర్తిగా విడిపోయింది. ఈ ఘటనతో విమానంలోని సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ సమాచారాన్ని విమానం పైలట్లకు చేరవేశారు. దీంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. 171 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో కూడిన విమానం తిరిగి పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో అలాస్కా ఎయిర్‌లైన్స్ ట్విట్టర్ (ఎక్స్) లో ఒక  పోస్ట్‌ కూడా చేసింది. ఈ ఘటనను(Plane Door Horror)తాము ట్రాక్ చేస్తున్నామని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ విమానం నుంచి మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ పూర్తిగా విడిపోయిన ఘటనపై మరిన్ని విషయాలు కూడా వెలుగుచూశాయి. మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విరిగిపోయిన టైంలో విమానం 16,325 అడుగుల ఎత్తులో ఉందని తెలిసింది. బోయింగ్ 737 MAX  మోడల్‌కు చెందిన  ఈ విమానాన్ని  బోయింగ్ కంపెనీ  2023 అక్టోబరు 1న అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేసింది.  2023 నవంబర్ 11, నుంచి ఈ విమానం  వాణిజ్య సేవలను మొదలుపెట్టింది.

Also Read: Bharat Jodo Nyay Yatra : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగో, ట్యాగ్‌లైన్ ఆవిష్కరణ

హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు. ఈ మేరకు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.