Site icon HashtagU Telugu

Bounty For Mosquitoes: దోమలు కొంటున్నారు.. 5 దోమలకు రూపాయిన్నర

Bounty For Mosquitoes Philippines Carlito Cernal Dengue

Bounty For Mosquitoes: దోమలు కొంటున్నారు. ఔను.. నిజమే. 5  దోమలను సజీవంగా లేదా చంపేసి పట్టుకున్నా  లేదంటే ఐదు  దోమల లార్వాలను తీసుకొచ్చినా రూపాయిన్నర గిఫ్టుగా ఇస్తారు.  ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకు సమీపంలోని బరంగే అడిషన్ హిల్స్ అనే గ్రామంలో ఈ స్కీంను అమలు చేస్తున్నారు. స్థానికంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతుండటంతో ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నారు.

Also Read :Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహకారం

దోమలపై యుద్ధం అందుకే.. 

ఫిలిప్పీన్స్‌ దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు 28,234 డెంగీ కేసులు నమోదయ్యాయి. బరంగే అడిషన్ హిల్స్ గ్రామంలో లక్షకుపైగా జనాభా ఉంది. ఇక్కడ కూడా వందలాది మంది డెంగీ ప్రబలింది. ఇటీవలే ఈ ఊరిలో డెంగీ వల్ల ఇద్దరు  పిల్లలు చనిపోయారు. దీంతో గ్రామ నాయకుడు కార్లిటో సెర్నల్ దోమలపై యుద్ధాన్ని ప్రకటించాడు. దోమలు తీసుకొస్తే డబ్బులిస్తామని అనౌన్స్ చేశాడు.  ఈ ప్రకటన వెలువడిన తర్వాత  దోమలను పట్టుకునేందుకు డజన్లకొద్దీ గ్రామస్తులు నలుమూలలకు బయలుదేరారు. బతికి ఉన్న దోమలను(Bounty For Mosquitoes) ఎవరైనా పట్టుకొని వస్తే.. వాటిని అతినీలలోహిత కాంతితో చంపేస్తున్నారు. 21 మంది ఇప్పటికే దోమలను పట్టుకొని వచ్చి, బహుమతులను అందుకున్నారు.  ఇప్పటివరకు మొత్తం 700 దోమలు, లార్వాలను తీసుకొచ్చారు.

Also Read :Miss World Pageant: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఎప్పుడంటే?

దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలలో..

బరంగే అడిషన్ హిల్స్ గ్రామం పరిధిలో దోమలను పట్టడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా  వీధులను శుభ్రం చేస్తున్నారు. డెంగీని వ్యాప్తి చేసే దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలలో నీరు పేరుకుపోకుండా జాగ్రత్త చర్యలను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న వారికి కూడా బహుమతులు ఇస్తున్నారు. గ్రామస్తులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బరంగే అడిషన్ హిల్స్ గ్రామపెద్దలు సూచించారు. టైర్లు వంటి దోమల వృద్ధి ప్రదేశాలను క్లీన్ చేస్తున్నారు. వాటిని తొలగిస్తున్నారు.  పొడవాటి చేతుల చొక్కాలు, ప్యాంటు ధరించాలని ప్రజలను కోరుతున్నారు. దోమల వికర్షకాలను వాడాలని అందరికీ సూచిస్తున్నారు.