Site icon HashtagU Telugu

Shocking Incident Viral : ఫ్లైట్ ఆలస్యం కావడం తో సిబ్బందిపై దాడి చేసిన ప్రయాణికుడు..

Indigo Crew Punched By Angr

Indigo Crew Punched By Angr

పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అనేక ఫ్లైట్స్ ఆలస్యం నడుస్తుండడం ..కొన్ని రద్దు అవుతుండడం జరుగుతుంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు దాదాపు 10 గంటలుగా విమానంలోనే ఉండడం..ఎంతసేపటికి అది కదలకుండా ఉండడం తో ఓపిక భరించలేక సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్.. వాతావరణం సహకరించకపోవడం వల్ల ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లోనే నిలిచిపోయింది. దాదాపు 10 గంటల పాటు ప్రయాణికులు ఫ్లైట్‌లోనే ఉండిపోయారు. అప్పటికే చాలా మంది సహనం కోల్పోయారు. సిబ్బందితో గొడవ పడుతూ వస్తున్నారు. కానీ సిబ్బంది మాత్రం వాతావరణం సరిగ్గా లేదని, వెంటనే వెళ్లిపోలేమని చెప్పుకొస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

“దయచేసి ఓపిక పట్టండి” అని రిక్వెస్ట్ చేసారు. ఆ సమయంలోనే ఓ ప్యాసింజర్ ఉన్నట్టుండి ముందుకి వచ్చాడు. ఫ్లైట్ కో కేప్టెన్‌పై పిడిగుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న ఎయిర్‌హోస్టెస్ వాళ్లిద్దరి మధ్య ఓ టేబుల్‌ని అడ్డుగా పెట్టింది. మళ్లీ దాడి చేయకుండా అడ్డుకుంది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా షాక్ అయ్యారు. గట్టిగా అరిచారు. “ఎందుకిలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫ్లైట్ కదలకపోతే డోర్ తెరవండి వెళ్లిపోతాం” అని ఆ ప్రయాణికుడు గట్టిగా వాదించాడు. అందుకు ఎయిర్‌హోస్టెస్‌లు గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పారు. ఇప్పటికిప్పుడు వెళ్లలేమని, ఇలా దాడి చేయడం సరికాదని వారించారు. ఇదంతా ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారింది.

Read Also : Modi : నేడు ఏపీలో NACIN కొత్త క్యాంపస్‌ ను ప్రారభించబోతున్న మోడీ..