మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని అశోక్‌నగర్‌లో ఓ వృద్ధ వికలాంగురాలు నివాసం ఉంటుంది. ఆమె వయస్సు 90ఏళ్లు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. ఆమె కుమార్తె తన కుటుంబంతో 180 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కుమార్తెను ఎలాగైనా కలుసుకోవాలని వృద్ధురాలు(Old Woman) బావించింది. అయితే, వృద్ధురాలి దగ్గర కుమార్తె వద్దకు వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేవు. అయినా బస్సు ఎక్కింది. సరిపడా డబ్బులు(Money) ఇవ్వకపోవటంతో బస్సు నుంచి దించేశారు. కుమార్తెను కలవాలనే ఆశ ఆ వృద్ధురాలికి పోలేదు. వృద్ధురాలు వికలాంగురాలు కావడంతో ఆమెకు ప్రభుత్వం(Government) ఇచ్చిన ట్రై సైకిల్(Tricycle) ఉంది. ఆ ట్రై సైకిల్‌పై వెళ్లేందుకు సిద్ధమైంది.
తన ప్రయాణ సమయంలో తినేందుకు కావాల్సిన తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వాటన్నింటిని ట్రై సైకిల్‌పై అమర్చుకుంది. అశోక్ నగర్‌లో నుంచి ఆమె నివాసం నుంచి ట్రై సైకిల్ పై గత పదిరోజుల క్రితం ప్రారంభమైంది. మధ్యమధ్యలో ఆగుకుంటూ మండుటెండలో ఆమె ప్రయాణం ఎనిమిది రోజులు సాగింది. ఎనిమిది రోజులు 180 కిలో మీటర్లు ఆమె ట్రై సైకిల్‌పైనే ప్రయాణించింది. ఎత్తు ప్రదేశాల్లో ట్రై సైకిల్‌ను ఆ వృద్ధురాలు తాడుతో లాగుకుంటూ వెళ్లింది. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఆ వృద్ధురాలు కూతురు దగ్గరకు చేరువైంది.
రాజ్‌గడ్ – పచోర్ హైవే వద్ద దివ్యాంగ వృద్ధురాలి సాహసయాత్ర విషయాన్ని తెలుసుకొని ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. సదరు వృద్ధురాలిని వివరాలుగా అడుగగా.. తన దగ్గర బస్సు ఎక్కేందుకు డబ్బులు లేకపోవటంతో బస్సులో నుంచి దింపేశారు. ఎలాగైనా నా కూతుర్ని కలవాలనుకున్నాను. అందుకే ఎనిమిది రోజుల్లో 180 కిలో మీటర్లు ప్రయాణించి నా కుమార్తె ఇంటికి వెళ్తున్నాను అని ఆ వృద్ధురాలి చెప్పింది. అయితే, దారిలో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది.
Also Read : Viral Stunt: ఫేమస్ అవడం కోసం కుక్కతో అలాంటి స్టంట్.. చివరికి?