బలగం సినిమాలో నల్లిబొక్కల గొడవలాగే చాల విందు భోజనాల్లో మటన్ ముక్కల లొల్లి నడుస్తుంది. భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ కొట్టుకున్న ఘటనలు చాల పెళ్లిళ్లలో వెలుగులోకి రాగా..తాజాగా బిజెపి ఎంపీ ఏర్పాటు చేసిన విందులో కూడా అలాంటి లొల్లే జరిగింది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మీర్జాపూర్(Mirzapur)లో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ జింద్ ..శుక్రవారం పార్టీ ఆఫీస్ లో ఓ కమ్యూనిటీ సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశం అనంతరం మంచి నాన్ వెజ్ భోజనం ఏర్పాటు చేసారు. మాములు భోజనం అంటే ఏదో అనుకుంటారు కానీ నాన్ వెజ్ భోజనం అంటే వదిలిపెడతారా..వారే కాక ఇంట్లో ఉన్న వారిని సైతం తీసుకొని వస్తారు. భోజనం విషయంలో తగ్గేదేలే అని వచ్చిన వారికీ ఏ లోటు జరగవద్దని ఆదేశించారు.
భోజనాలకు దాదాపు 250కి పైగా హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్(Mutton) ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేసి మాత్రమే వేసారట. అంతే నాకు ముక్క వేయలేదని చెప్పి లొల్లి స్టార్ట్ చేసాడు. అంతే వడ్డించే వ్యక్తి చెంపపై గట్టిగా కొట్టడంతో అక్కడ పెద్ద వివాదం మొదలైంది. అది కాస్త ఘర్షణకు దారి తీసి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ విషయం తెలిసి పోలీసులు రంగంలోకి ఎక్కడి వారిని అక్కడికి చెల్లాచెదురుచేసి అక్కడినుండి పంపేంచేసారు. అరే ఇలా జరిగిందేంటి అని సదరు ఎంపీ వాపోయాడు.
Read Also : Mahasena Rajesh : మహాసేన రాజేశ్ పై కేసు నమోదు