Musk Vs Wikipedia : ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. తాజాగా ఆయన వికీపీడియా టార్గెట్ గా వివాదాస్పద ట్వీట్స్ చేశారు. వికీపీడియా పేరును డికీపీడియాగా మార్చుకుంటే తాను దాదాపు రూ.8300 కోట్లు (1 బిలియన్ డాలర్లు) ఇస్తానని ప్రకటించాడు. దీనిపై ట్విట్టర్ లో వాడివేడి చర్చ నడిచింది. ట్విట్టర్ ను అవలీలగా కొనేసి, దాని పేరును ఎక్స్ గా మార్చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు వికీపీడియాపైనా కన్నేశాడా అనే టాపిక్ పై నెటిజన్స్ మధ్య హాట్ డిస్కషన్ నడిచింది. ఈక్రమంలో ఎలాన్ మస్క్ ట్వీట్ కు ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ.. ‘‘వికీపీడియా వాళ్లు వెంటనే రూ.8300 కోట్లను ఎలాన్ మస్క్ నుంచి తీసుకొని.. పేరును డికీపీడియాగా మార్చుకోవాలి. డబ్బులు చేతికి అందిన ఒకరోజు తర్వాత మళ్లీ పాత పేరు పెట్టుకుంటే సరిపోతుంది’’ అని సెటైర్ వేశాడు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ‘‘నేనేం వెర్రోడిని కాదు.. కనీసం 1 సంవత్సరం పాటు వికీపీడియా పేరు డికీపీడియాగా కొనసాగించాలి. అలా అయితే నేను డబ్బులు ఇచ్చేస్తాను’’ అని (Musk Vs Wikipedia) కౌంటర్ ఇచ్చాడు.
వికీమీడియా ఫౌండేషన్‌కు డబ్బు ఎందుకు ?: మస్క్
ఎలాన్ మస్క్ ఇంకా కంటిన్యూ చేస్తూ.. ‘వికీపీడియా అమ్మకానికి లేదు’ అని వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ గతంలో వికీపీడియా హోం పేజీలో డిస్ ప్లే చేయించిన మెసేజ్ క్లిప్ ను పోస్ట్ చేశాడు. ఈ క్లిప్ తో పాటు ఎలాన్ మస్క్ ఒక కామెంట్ ను ఇలా రాసుకొచ్చాడు.. ‘‘వికీమీడియా ఫౌండేషన్‌కు అసలు డబ్బు ఎందుకు ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? వికీపీడియాను ఆపరేట్ చేయడానికి డబ్బులు అవసరమే లేదు. మీరు మీ ఫోన్‌లో కూడా ఆ టెక్స్ట్ కాపీని రెడీ చేసుకోవచ్చు. ఇంకా డబ్బు దేనికి? చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తున్నారు’’ అని ట్విట్టర్ యజమాని మస్క్ కామెంట్ చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
నా పేజీలో ఆవు, ఆవుపేడలను యాడ్ చేయండి : మస్క్
ఆ వెంటనే ఎలాన్ మస్క్ చేసిన మరో పోస్ట్‌లో..‘‘నా వికీపీడియా పేజీకి ఆవు, ఆవుపేడలను యాడ్ చేయండి’’ అని కోరాడు. దీనికి ఇప్పటివరకు దాదాపు 1 కోటికిపైగా వ్యూస్, లక్షకుపైగా లైక్స్ రావడం విశేషం. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘‘వికీపీడియా వాళ్లు నిత్యం విరాళాలు అడుగుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్లు విరాళాలు సేకరించడానికి నేరుగా వస్తారేమో’’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘‘ఎలాన్ మస్క్ .. మీరు వికీపీడియాను కొనేయండి. మీ ఏఐ టెక్నాలజీతో ఆటోమేటిక్ గా వికీపీడియా అప్ డేట్ అయ్యేలా చేయండి’’ సలహా ఇచ్చాడు.
(Please add that to the 🐄💩 on my wiki page)
— Elon Musk (@elonmusk) October 22, 2023