Site icon HashtagU Telugu

ఫోన్ మాట్లాడ్డం లేదని హత్య..దారుణ ఘటన

9649f8ae08

9649f8ae08

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల యువతి తనతో మాట్లాడట్లేదని ఓ వ్యక్తి ఆమెను 51 సార్లు స్క్రూ డ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కొర్బా జిల్లాలో ఈ నెల 24వ తేదీన ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని పంప్ హౌజ్ కాలనీలో ఈ హత్య జరిగినట్లు సిటీ ఎస్పీ విశ్వదీపక్ త్రిపాఠి మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ హత్యకు సంబంధించిన పలు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఘటన జరగడానికి ముందు బాధితురాలు ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటోందని, నిందితుడు ఆమె వద్దకు వచ్చి దారుణంగా ప్రవర్తించాడని తెలిపారు. బాధితురాలి నోటికి దిండును అడ్డుపెట్టి ఆమె అరుపులు బయటకు వినిపించకుండా చేశాడని, ఆ తర్వాత ఓ స్క్రూ డ్రైవర్‌తో ఆమెను చాలా దారుణంగా 51 సార్లు పొడిచి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.

బాధిత మహిళ సోదరుడు ఇంటికి రాగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. దీంతో ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. నిందితుడు జశ్‌పూర్ జిల్లా వాడని, మూడేళ్ల క్రితం బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడు బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె ఆ బస్సులో ప్రయాణించేది. అప్పుడే వారి ఇరువురికి పరిచయం ఏర్పడింది.

నిందితుడు తన పని నిమిత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడే ఉండేవాడు. అయితే వారిద్దరూ ఫోన్‌లోనే టచ్ లో ఉన్నాడు. కానీ కొన్ని రోజులుగా ఆమె తనతో మాట్లాడ్డం లేదని, ఆమెను ఆమె తల్లిదండ్రులను కూడా అతడు బెదిరించాడు. ఈ క్రమంలోనే నిందితుడు బాధితురాలని హత్య చేసి పరార్ అయ్యాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.