Site icon HashtagU Telugu

Monalisa : మోనాలిసాకు ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్..!

Monalisha Arriving In A Hig

Monalisha Arriving In A Hig

సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మోనాలిసా భోస్లే (Monalisa ) తాజాగా మరో సంచలన వార్తతో హాట్ టాపిక్‌గా మారింది. మహా కుంభమేళా సందర్భంగా తెగ పాపులర్ అయిన ఆమెకు బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా తీయబోయే “ది మణిపూర్ డైరీ” సినిమాలో మోనాలిసాకు కీలక పాత్ర లభించింది. ఈ వార్త ఆమెను దేశవ్యాప్తంగా మరింత ప్రచారంలోకి తీసుకురాగా, ప్రస్తుతం ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మోనాలిసా ఇటీవల కేరళలో జరిగిన ఓ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరైంది.

Vishwambhara : విశ్వంభర లో మరో మెగా హీరో..?

కేరళ కోజికోడ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ (బోచె) తన కొత్త చెమ్మనూర్ జ్యువెలరీ షోరూమ్‌ను ప్రారంభించే సందర్భంగా ప్రత్యేక అతిథిగా మోనాలిసాను ఆహ్వానించారు. ఈ ప్రారంభోత్సవంలో మోనాలిసా పాల్గొనడం స్థానిక ప్రజల మధ్య సంచలనం రేపింది. జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా బాబీ చెమ్మనూర్ మోనాలిసాకు రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ బహుకరించారు. షోరూమ్ ప్రారంభోత్సవానికి ముందు నుంచే మోనాలిసా వస్తోందని తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వేడుకలో భాగంగా బాబీ చెమ్మనూర్ స్టేజ్‌పైకి వెళ్లి మోనాలిసాతో కలిసి డ్యాన్స్ చేశారు. వారిద్దరిని చూసి అక్కడి అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక స్టేజ్‌పై మోనాలిసాతో ఫోటోలు దిగేందుకు యువత పెద్ద ఎత్తున పోటీపడ్డారు. మోనాలిసా, బాబీ చెమ్మనూర్ కలిసి ఓ ఖరీదైన కారులో షోరూమ్‌కు రావడం, అక్కడ ఫ్యాన్స్‌ను చూసి మోనాలిసా అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Pawan Kalyan Donation : ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ భారీ సాయం

బాబీ చెమ్మనూర్ కేరళలో అనేక గోల్డ్ షోరూమ్‌లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం తన బ్రాండ్ ప్రమోషన్ కోసం మోనాలిసాను చెమ్మనూర్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మోనాలిసా ప్రస్తుతం యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటికీ, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు దశల వారీగా ముందుకు సాగుతోంది.