90 ఏళ్ల బాడీబిల్డర్ గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్ లోకి ఎక్కాడు. ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే అని నిరూపించాడు పై ఫొటోలో కనిపించే వ్యక్తి. సాధారణంగా 60, 70 ఏళ్ల వయసులో సీనియర్ సిటీజన్స్ గుమ్మం దాటి బయటకు రాలేరు. 80 ఏళ్ల తర్వాత కూడా అసలు నడవడానికే సాధ్యపడదు. రిటైర్ మెంట్ అయ్యాక ఆధ్యాత్మిక చింతనతో గడపుతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం యువకులతో పోటీ పడుతూ జిమ్ చేస్తాడు. కండలు తిరిగేలా అనేక వ్యాయామాలు చేస్తాడు. ప్రతిరోజు జిమ్ లో నచ్చిన వర్కవుట్స్ చేస్తూ మంచి డైట్ ను ఫాలో అవుతున్నాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 90 ఏళ్ల వ్యక్తి వీడియోను జూలై 19న పోస్ట్ చేసింది. నిమిషాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. 29,000 వ్యూస్ వచ్చాయి. పోస్ట్‌కు అనేక లైక్‌లు కూడా వచ్చాయి. 90 ఏళ్ల వయస్సులో చాలా యాక్టివ్ ఎక్సర్ సైజ్ లు చేస్తునాడు. ఇప్పటికీ బాడీబిల్డింగ్ పోటీల్లో అనేక పథకాలు పొందాడు. ఇటీవల నెవాడాలోని రెనోలో జరిగిన IFBB ప్రొఫెషనల్ లీగ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు, పురుషుల 70 కంటే ఎక్కువ విభాగంలో మూడవ స్థానంలో, 80 ఏళ్లు పైబడిన విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు.
Also Read: Thota Chandrasekhar: కేసీఆర్ నాయకత్వం ఏపీ ప్రజలకు అవసరం!