Matrimonial Ad : పెళ్లి సంబంధాల కోసం ఇచ్చే పత్రికా ప్రకటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు ఇచ్చిన మ్యాట్రిమోనియల్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రస్తావించిన అంశాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read :Sanjoy Roy : వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదు.. హత్యాచారం చేసింది సంజయ్ రాయే
వరుడి తరఫున పెళ్లి సంబంధం కోసం వెతుకుతూ ఆ యాడ్ ఇచ్చారు. అందులో వరుడి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ‘‘నాకు ఏడాదికి రూ.29 లక్షల ఆదాయం వస్తుంది. వార్షిక ఆదాయం ఏటా 54 శాతం చొప్పున పెరుగుతుంటుంది’’ అని వరుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ‘‘నేను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్‌గా(Matrimonial Ad) పనిచేస్తుంటాను. అందులో పెట్టుబడులు పెట్టి ఏటా బాగానే డబ్బులను ఆర్జిస్తుంటాను’’ అని వరుడు పత్రికా ప్రకటనలో ప్రస్తావించాడు. ‘‘నేను సేఫ్‌గా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటాను. అందుకే ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నాను. నా ప్రొఫైల్ నచ్చిన వారు మెసేజ్ చేస్తే.. వారి నంబరుకు 16 స్లైడ్‌లతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లిప్‌ను షేర్ చేస్తాను ’’ అని వరుడు చెప్పాడు.
ఈ యాడ్‌ను ‘ఎక్స్’లో చూసి కొందరు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. వివిధ రకాల కామెంట్లు పెట్టారు. ‘‘కేవలం షార్ట్ సెల్లర్లు మాత్రమే ఏటా అంత డబ్బును (రూ.29 లక్షలు) సంపాదించగలరు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్‌తో సామాన్యులు రోజువారీ ఇంటి ఖర్చులను వెళ్లదీయలేరు’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ‘‘ఏటా 54 శాతం చొప్పున ఆదాయం పెరగడం అంటే మామూలు విషయం కాదు.. ఈ వరుడిని చూస్తుంటే వారెన్ బఫెట్‌ను మించినవాడిలా కనిపిస్తున్నాడు’’ అని కొందరు నెటిజన్స్ సెటైర్స్ పేల్చారు. ‘‘బహుశా.. ఆ వరుడు కాల్ ఆప్షన్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు అనిపిస్తోంది. కానీ అది అంత మంచిది కాదు. ఇలాంటి వాళ్లకు డిమాండ్ ఉండదు’’ అని మరో నెటిజన్ విమర్శించాడు. ‘‘నేను ఆ యాడ్‌ను చూసి భయపడ్డాను. ఫిషింగ్ స్కాంలో భాగంగా వచ్చిన మెసేజ్ అనుకున్నా’’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు.