Cadbury Dairy Milk: డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు

చాక్లెట్ డే రోజే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇష్టపడి కొనుక్కున్న క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ చాక్లెట్లో బతికున్న పురుగు దర్శనమిచ్చింది. దీంతో సదరు వ్యక్తి షాక్‌కు గురయ్యాడు.

Cadbury Dairy Milk: చాక్లెట్ డే రోజే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇష్టపడి కొనుక్కున్న క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ చాక్లెట్లో బతికున్న పురుగు దర్శనమిచ్చింది. దీంతో సదరు వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధిచిన వీడియోని సదరు కంపెనీకి టాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది. అయితే వినియోగదారుడి పోస్టుకు కంపెనీ స్పందించింది. పూర్తి వివరాలు పంపాల్సిందిగా కోరింది. అంతేకాకుండా క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టింది.

చాక్లెట్.. ఇష్టపడని వారు అసలు ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు చాక్లెట్‌ను చాలా ఇష్టంగా తింటారు. కస్టమర్లను ఆకర్షించేందుకు తియ్యని వేడుక చేసుకుందాం.. అంటూ టీవీలో ప్రకటనలు ఇచ్చే డైరీ మిల్క్ సంస్థ ప్రస్తుతం ఇబ్బందులు పాలైంది. ఓ వినియోగదారుడికి ఎదురైనా చేదు అనుభవం ప్రస్తుతం సంస్థకే చెడ్డ పేరు వచ్చింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రత్నదీప్ నుండి కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగుల వీడియోను రాబిన్ జాకీస్ వ్యక్తి పోస్ట్ చేశాడు గడువు ముగిసిపోతున్న ఉత్పత్తులకు నాణ్యత తనిఖీలు చేయరా అని ప్రశ్నించాడు. ప్రజారోగ్య ప్రమాదాలకు బాధ్యత గురించి నిలదీశాడు. జిహెచ్‌ఎంసి, క్యాడ్‌బరీ డైరీ మిల్క్, సూపర్ మార్కెట్ రత్నదీప్ ను ట్యాగ్ చేస్తూ కొనుగోలు బిల్లు ఫోటోను షేర్ చేశాడు.

కాగా ఈ ట్వీట్ కు నెటిజన్లతో పాటు జీహెచ్ ఎంసీ అధికారులు, క్యాడ్ బరీ డైరీ మిల్క్ కంపెనీ కూడా స్పందించాయి. క్యాడ్‌బరీ అత్యధిక నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి ప్రయత్నిస్తోంది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. మీ ఆందోళనను పరిష్కరించడానికి దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ మరియు కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com సైట్ కి పంపగలరు అని పోస్ట్ చేసింది సంస్థ. మీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అభ్యర్ధించింది. మరోవైపు సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది.

Also Read: Raisins: ఎండుద్రాక్షలు ఎన్ని ర‌కాలో తెలుసా..? ఏ స‌మ‌యంలో ఏవి తినాలో తెలుసుకోండి..!

Follow us