బిహార్ (Bihar ) రాష్ట్రానికి చెందిన ముకేశ్ కుమార్ (Mukesh Kumar) అనే పాల వ్యాపారి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఆశ్చర్యకరమైన ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో “దేశంలోని ప్రతి వ్యవస్థపై BJP, RSS పెత్తనం చెలాయిస్తోంది” అని చేసిన వ్యాఖ్యతో తాను షాక్‌కు గురయ్యానని ..ఈ షాక్ లో తన చేతిలో ఉన్న 5 లీటర్ల పాలు క్యాన్ (five litres of milk bucket) కిందపడడంతో పాలన్నీ నేలపాలైపోయి రూ.250 నష్టం జరిగిందని తెలిపారు.
Almond : ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ ఘటనకు రాహుల్ గాంధీనే కారణమని చెబుతూ, ముకేశ్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.250 నష్టానికి బాధ్యుడిగా రాహుల్ గాంధీని గుర్తించి నష్టపరిహారం అందించాలనే అభ్యర్థన చేశారు. ఇది రాజకీయంగా కాకుండా తాను ఎదుర్కొన్న వ్యక్తిగత నష్టాన్ని వెల్లడించే చర్య అని ముకేశ్ పేర్కొన్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఒక పాల వ్యాపారి జీవితంలో నేరుగా ప్రభావం చూపించాయా? అంటూ మాట్లాడుకుంటూ.. ఇది కావాలని చేసిన ఫిర్యాదు అని పేర్కొంటున్నారు. రూ. 250 లకోసం రాహుల్ పై ఫిర్యాదు చేయటం ఏంటి విచిత్రం కాకపోతే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
రాహుల్ గాంధీపై ఈ ఫిర్యాదును కొందరు వ్యంగ్యంగా చూస్తుండగా, మరికొందరు దీనిని రాజకీయ దృష్టితో విశ్లేషిస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ప్రజల జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయనే చర్చకు ఇది ఒక ఉదాహరణగా నిలిచింది అని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఓ అగ్ర నేతపై ఇలాంటి ఫిర్యాదు చేయడం అందర్నీ షాక్ కు గురిచేస్తుంది.
