మహారాష్ట్ర థానే జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. 64 ఏళ్ల అభిమాన్ గిర్ధర్ (Abhiman Girdhar) అనే వృద్ధుడు క్యాన్సర్‌తో బాధపడుతూ స్పృహ కోల్పోయారు. గిర్ధర్‌ను కుటుంబ సభ్యులు శివనేరి ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుడు డా. అహుజా ఆయనను పరిశీలించి మరణించారని ధ్రువీకరించారు. దీంతో కుటుంబీకులు దుఃఖంలో మునిగిపోయారు. గిర్ధర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. అతని పార్థీవదేహాన్ని ఆచార రీత్యా స్నానం చేయించి, చివరి సంస్కారాలకు సిద్ధమయ్యారు.
YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
అయితే అంత్యక్రియల మద్యలో ఒక్కసారిగా గిర్ధర్ కళ్ళు తెరిచారు. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ లేచి కూర్చొన్నారు. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొన్ని క్షణాల పాటు ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. చనిపోయాడని భావించిన వ్యక్తి తిరిగి శ్వాస తీసుకోవడంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే గిర్ధర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రులలో సరైన శరీర నిర్దిష్ట పరీక్షలు చేయకపోవడం వల్ల ఇలాంటి విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. గిర్ధర్ కుటుంబం మాత్రం దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ, పునర్జన్మ లభించిందని చెపుతున్నారు.