Viral : ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికిన యువకుడు..అరె ఏంట్రా ఇది..!!

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 04:33 PM IST

బైక్ ‘కీ’ కోసం ఓ యువకుడు (Bengaluru Man ) ట్రాఫిక్ పోలీస్ చేతి వేలిని కొరికిన (Cop’s Finger) ఘటన బెంగుళూర్ (Bengaluru ) లో చోటుచేసుకుంది. రోడ్ల ఫై వెళ్ళేక్రమంలో ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే ఏదో తెలియని భయం వాహనదారుల్లో మొదలవుతుంది. అన్ని కరెక్ట్ గానే ఉన్న ఏదోకటి లేదని చెప్పి ఫైన్ వేయడం..లేదంటే తమ వాహనాన్ని పక్కకు పెట్టడం చేస్తుంటారు. అందుకే రోడ్ల ఫై డ్రైవ్ చేసే క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఏమైనా ఉన్నారా..? అని చూసుకుని వెళ్తుంటారు. తాజాగా బెంగుళూర్ ఓ యువకుడి బైక్ ను ట్రాఫిక్ పోలీస్ ఆపడంతో ఏకంగా సదరు యువకుడు ఆ ట్రాఫిక్ పోలీస్ వేలి కొరికాడు.

We’re now on WhatsApp. Click to Join.

వివరాల్లోకి వెళ్తే..

సయ్యద్ సఫీ (28 ) (Syed Shafi) అనే యువ‌కుడు హెల్మెట్ (Helmet) లేకుండా స్కూటీని న‌డుతున్నాడు. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ దగ్గర దీన్ని గ‌మ‌నించిన ట్రాఫిక్ పోలీసులు అత‌డిని ఆపాడు. ఓ కానిస్టేబుల్ స‌ఫీ స్కూటీ కీ ను తీసుకున్నాడు. మ‌రో కానిస్టేబుల్ వీడియో రికార్డు చేస్తున్నాడు. అయితే.. స‌ఫీ వారితో వాగ్వాదానికి దాగాడు. తాళం ఇస్తావా ఇవ్వవా అంటూ అత‌డు తాళాలు తీసుకునేందుకు ట్రై చేసాడు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎంతకు ఇవ్వకపోవడం తో ఏకంగా ట్రాఫిక్ పోలీస్ వేలిని కొరికాడు. వీడియో ఎందుకు రికార్డు చేస్తున్నావంటూ మ‌రో కానిస్టేబుల్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కుకున్నాడు. మీరు ఎంతైనా వీడియో తీసుకోండి..త‌న వీడియో వైర‌ల్‌గా మారినా తాను పట్టించుకోన‌ని చెపుతూ.. అక్క‌డి నుంచి పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. పోలీసులు అత‌డిని ప‌ట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దుర్భాష‌లాడ‌డం, శారీర‌కంగా గాయ‌ప‌ర‌చ‌డం, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించినందుకు అత‌డిపై కేసు న‌మోదు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : AP DSC Notification : జగనన్న “దగా డీఎస్సీ” ఇచ్చారు – షర్మిల

Follow us