బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్ జూలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జూ కీపర్‌గా విధులు నిర్వహిస్తున్న 58 ఏళ్ల జియాన్ రంగఖారసమీ (Zookeeper Jian Rangkasamee) అనే వ్యక్తిని సింహాలు పీక్కుతిన్నాయి. ఈ భయానక ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు చూసి షాక్‌కు గురయ్యారు. వారు సింహాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, 15 నిమిషాల పాటు సింహాలు అతడిని వదల్లేదని బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక వెల్లడించింది. ఈ ఘటన తర్వాత అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే జియాన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sonia Gandhi: సోనియా గాంధీకి భారీ ఊరట.. పౌరసత్వం కేసు కొట్టివేత!
ఈ దుర్ఘటనకు కారణం జూ కీపర్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు తెలిపారు. జంతువులకు ఆహారం వేసే సమయంలో లేదా వాటి దగ్గరకు వెళ్ళేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు చాలా కఠినంగా ఉంటాయని, వాటిని పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. ఈ విషాదకరమైన ఘటన జూ సిబ్బందిలో తీవ్ర ఆందోళన కలిగించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా జూల యాజమాన్యాలు మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. జూ కీపర్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.