Site icon HashtagU Telugu

Kurchi Thatha : ఆఖరికి ‘కుర్చీ తాత’ను భిక్షాటన చేసుకునేలా చేసారా..?

Kurchithata

Kurchithata

ఈరోజుల్లో ప్రతిఒక్కరు తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు..తమ పాపులార్టీ ..డబ్బు సంపాదన పెంచుకోవడం కోసం ఏమైనా చేస్తున్నారు. అవతలి వ్యక్తిని ఎంత వాడుకోవడంలో అంత వాడేసుకుంటూ..చివరికి రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ‘కుర్చీ తాత’ (Kurchi Thatha) ను కూడా అలాగే చాలామంది యూట్యూబ్ చానెల్స్ వాడుకొని వదిలేసాను. ఇక ఇప్పుడు చేసేదేం లేక ఆ తాత బస్సుల్లో , రోడ్ల వెంట భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు.

హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా తిరుగుతూ ఉండే షేక్ మహ్మద్ పాషా ఒకసారి తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొడితే మెడలు విరిగిపోయాయని చెప్పాడు. ఈ డైలాగ్ వైరల్ కావడంతో షేక్ మహ్మద్ పాషా కాస్త… కుర్చీ తాత అయ్యాడు. కుర్చీ తాత యాటిట్యూడ్ కా బాప్. ఆయన మాటలు కరుకుగా కుంబద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఈ లక్షణం యూట్యూబర్స్ ని ఆకర్షించింది. కుర్చీ తాతను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. కుర్చీ తాతకు మంచి బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేవారు. తెలంగాణ అసెంబీలో ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను కావాలని తిట్టించిన వారు కూడా ఉన్నారు. ఇలా చాలామంది యూట్యూబర్లు కుర్చీ తాత ను వాడుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతే ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సైతం కుర్చీ తాత ను వాడుకున్న వారి జాబితాలో ఉన్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలోకి దిగుతోంది.
రీసెంట్ గా రిలీజ్ అయినా కుర్చీ మడతపెట్టి అనే మాస్ పాట సినిమా ఫై మరింత అంచనాలు పెంచింది. ఈ పాటలో తన పదాన్ని వాడినందుకు థమన్ రూ.5000 ఇచ్చినట్లు కుర్చీ తాత చెప్పుకొచ్చాడు. ఈ పాట విడుదల తర్వాత కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సడెన్ గా ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. నన్ను కుర్చీ తాత అంటారండి.. నాకు ఇవ్వడానికి రూపాయి కూడా లేదా అంటూ ఈయన యాచిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వీడియోస్ చూసిన నెటిజన్లు యూట్యూబ్ ఛానళ్లస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాతను వాడుకున్నంత సేపు వాడుకొని..ఇప్పుడు రోడ్డున పడేశాయని మండిపడుతున్నారు.

Read Also : AP : జీవీ హర్షకుమార్ తో లగడపాటి భేటీ ..అసలు ఏంజరగబోతుంది..?

Exit mobile version