Viral : రైలు చక్రాల మధ్య ఇరుక్కున్న బాలుడు..100 కి.మీ తర్వాత చూసిన రైల్వే సిబ్బంది

సడెన్ గా రైలు కదిలేసరికి.. బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్‌కు చేరుకుంది

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 01:56 PM IST

సాధారణంగా పట్టాలు దాటే క్రమంలో ఏదైనా గూడ్స్ రైలు ఆగివుంటే..దానిని కింది నుండి అవతలి పక్కకు వెళ్తుంటారు. ఇది చాల ప్రమాదకారణం అని తెలిసినప్పటికీ అలాగే చేస్తుంటారు. ఇలా దాటుతుండగా…సడెన్ గా రైలు కదిలిన ఘటనలు..ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. కానీ తాజాగా మాత్రం ఓ బాలుడు ఆగిఉన్న గూడ్స్ రైలు కింద ఆడుకుంటూ..సడెన్ గా ఆ రైలు కదిలేసరికి..రైలు చక్రాల మధ్య చిక్కుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

వివరాల్లోకి వెళ్తే…

రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం గత కొంతకాలంగా నివసిస్తుంది. ఆ కుటుంబానికి చెందిన పదేళ్ల వయసున్న బాలుడు రైల్వే ట్రాక్ ఫై ఆగిఉన్న గూడ్స్ రైలు కింద ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో సడెన్ గా రైలు కదిలేసరికి.. బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్‌కు చేరుకుంది. రైలు సిబ్బంది తనిఖీ చేస్తుండగా బాలుడిని చూసి షాకయ్యారు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం హర్దోయ్‌లోని చైల్డ్‌కేర్ సెంటర్‌కు తరలించారు. బాలుడు దగ్గరి నుండి వివరాలు సేకరించగా… బాలుడి కుటుంబం లక్నో-అలంనగర్ రాజాజీపూర్‌లోని బాలాజీ మందిర్‌లో నివసిస్తున్నట్టు తేలింది. వెంటనే కుటుంబ సబ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాలుడికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : AP Congress : మరో లిస్ట్ వచ్చేసింది.. 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే