Kavya Maran : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు, ప్రేక్షకుల కళ్లతో పాటు కెమెరాలు కూడా తరచూ ఫోకస్ చేస్తాయో వ్యక్తిని.. ఆమె ఎవరో కాదు, జట్టు సహ యజమాని కావ్య మారన్. ఆటలో ప్రతి మలుపు, ప్రతి ఎమోషన్ పై ఆమె వ్యక్తీకరణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా ఆమె తనపై సర్క్యూలేట్ అవుతున్న మీమ్స్‌పై స్పందించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “క్రికెట్ అంటే నాకు నిష్కల్మషమైన ప్రేమ ఉంది. మా జట్టు ఎక్కడ ఆడినా, వారికి మద్దతుగా ఉండాలనే భావనతో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూస్తుంటాను. నేను ఎక్కడ కూర్చున్నా కెమెరా నన్ను వదలదు. అది బహుశా నా ఆటపై ఉన్న ఆసక్తి వల్లే అయుంటుంది” అని చెప్పారు.
కావ్య మారన్ కేవలం యజమాని మాత్రమే కాదు, ఒక నిజమైన ఫ్యాన్. జట్టు గెలిచినప్పుడు ఆ హర్షాతిరేకం, ఓడినప్పుడు చూపించే బాధ.. అన్నీ అభిమానులను మధురంగా తాకుతుంటాయి. క్లిష్ట సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నాలు చేయడంలోనూ ఆమె ముందుంటారు.
ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, క్లాసెన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న సన్‌రైజర్స్ జట్టుకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమాన బేస్ ఉంది. గతంలో 2016లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో టైటిల్ గెలిచిన ఈ జట్టు, 2018, 2024 సీజన్లలో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Tragedy : ప్రేమ పేరుతో సహజీవనం.. చివరకు గొంతు కోసిన ఘాతుకం..ఆపై దావత్!