Site icon HashtagU Telugu

Journalist Fight to Leopard : చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్

Journalist Fight To Leopard

Journalist Fight To Leopard

మాములుగా చిరుతపులిని (Leopard) చూస్తే ఎవరికైనా భయం మొదలవుతుంది..దూరంగా ఉందని తెలిసే..ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తుంటాం..అలాంటిది ఏకంగా దాడికి దిగితే..దాని నోటికి ఆహారం కావడం తప్ప మరోటి ఉండదు. కానీ ఇక్కడ ఓ జర్నలిస్ట్ (Journalist)మాత్రం ప్రాణాలకు తెగించి చిరుత తో ఫైట్ చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ – దుంగార్‌పుర్‌ (Dungarpur District) గ్రామంలో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

గ్రామంలోకి చిరుత చొరబడిందనే వార్త తెలిసి..దానిని కవర్ చేద్దామని ఓ జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళాడు. చిరుతను చూసిన గ్రామస్థులు పెద్ద పెద్దగా అరుస్తూ..రాళ్లతో, కర్రలతో దానిని తరిమి కొట్టాలని ట్రై చేసారు. ఈ తరుణంలో చిరుత కోపం తో ఎదురుగా వచ్చి..అక్కడ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ కాలును నోటితో పట్టుకుంది. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా సదరు జర్నలిస్ట్..చిరుత మెడ, దవడను గట్టిగా పట్టుకొని కాసేపు దానితో ఫైట్ చేసాడు. ఈ లోప్[యూ గ్రామస్థులు తాళ్లతో దానిని బాధించి..అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఆ చిరుతను తీసుకెళ్లారు. ఏ ఘటన తో జర్నలిస్ట్ కు పలుచోట్ల గాయాలు అయ్యాయి. కానీ జర్నలిస్ట్ ధైర్యానికి అంత మెచ్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also ; Nara Lokesh : సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే..!