Site icon HashtagU Telugu

Jasmine Flowers: చివరికి మల్లెపూలు కూడా కల్తీయే.. వీడియో వైరల్..!

Jasmine Flowers

Jasmine Flowers

Jasmine Flowers: మ‌న‌కు పువ్వులు అన‌గానే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది మ‌ల్లెపూలే. ఆడవారు శుభ‌కార్యానికి లేదా ఇంట్లో ఏమైనా పూజ ఉంటే ఎక్కువ‌గా వాడే మ‌ల్లెపూల‌నే (Jasmine Flowers). ఈరోజుల్లో మార్కెట్‌లో ఏది నిజ‌మో..? ఏది అబద్ధామో తెలియ‌టం లేదు. తాజాగా మ‌హిళ‌లు వాడే మ‌ల్లెపూల‌ను కూడా క‌ల్తీ చేస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. అయితే మ‌హిళ‌లు ఇష్టంగా త‌మ జ‌డ‌లో పెట్టుకునే మ‌ల్లెపువ్వుల‌ను సైతం క‌ల్తీగా మారుస్తున్నారు. వాటిని తాజాగా ఉంచ‌టం కోసం ర‌క‌ర‌కాల కెమిక‌ల్స్ వాడుతున్నారు. అంతేకాకుండా మ‌హిళ‌ల ప్రాణాల‌ను రిస్క్‌లో పెడుతున్నారు. అయితే ఇలా మ‌ల్లెపువ్వుల‌ను క‌ల్తీ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఎండా కాలంలో మల్లెపువ్వులు విరివిగా అందుబాటులో ఉంటాయి. దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా.. ఏదైనా ఫంక్ష‌న్‌కు కొనుగోలు చేసి మరీ జ‌డలో పెట్టుకుంటుంటారు. అయితే మల్లెపువ్వులను ‘కాపర్ సల్ఫేట్’లో ముంచి తీస్తున్నవీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. అయితే మ‌హిళ‌లు వీటిని పెట్టుకోవ‌డం వ‌ల‌న త‌మ ప్రాణాలను రిస్క్‌లో పెట్టిన‌వార‌వుతారు. అనేక స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. అలాగే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురి కావల్సి వస్తుంది. అయితే వైర‌ల్ అవుతున్న వీడియో ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ల్లెపువ్వుల దండ‌ల‌ను కాప‌ర్ స‌ల్ఫేట్ క‌లిపిన వాట‌ర్‌లో ముంచి వాటిని వేరే ట్రైలో వేస్తున్న‌ట్లు మ‌నం చూడ‌వ‌చ్చు.

Also Read: Dehydrated Symptoms: మీరు తాగే నీటిలో వీటిని క‌లుపుకుని డ్రింక్ చేస్తే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టిన‌ట్టే..!

అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. కానీ మహిళలు వీటిని పెట్టుకుంటే లేనిపోని అనారోగ్య స‌మ‌స్య‌లు కొని తెచ్చుకున్న‌ట్లు అని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే అంటున్నారు నిపుణులు. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురి కాకూడదంటే.. మల్లె పువ్వులు కొనే ముందు జాగ్ర‌త్త‌గా ఆలోచించి కొనుగోలు చేయాల‌ని నిపుణులు సైతం హెచ్చ‌రిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join