Site icon HashtagU Telugu

Japan : మూడేళ్లలో 3 వేల ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. ఎందుకు చేసిందో తెలుసా..

Japan Women calls almost 3000 for Emergency Number

Japan Women calls almost 3000 for Emergency Number

ఒక్కోసారి ఒంటరితనం, డిప్రెషన్ మనషులను తినేస్తుంది. అర్థం పర్ధం లేని పనులు చేయిస్తుంది. నిజానికి ఒక్కరే ఉండాలనుకోవటం ఏకాంతం. దానిలో తప్పు లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కరిగా మిగిలిపోవడం మాత్రం ఒంటరితనం. జపాన్ లో ఓ మహిళ ఒంటరితనాన్ని భరించలేక ఏం చేసిందో తెలుసా

దాదాపు మూడేళ్ల వ్యవధిలో 2,761 తప్పుడు ఎమర్జెన్సీ కాల్స్(false emergency calls) చేసిన ఓ 51 సంవత్సరాల వయసున్న మహిళను జపాన్‌లో( Japan) అరెస్ట్ చేశారు. రాజధాని టోక్యో(Tokyo)కు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లోని మాట్సుడో(Matsudo)కు చెందిన హిరోకో హటగామి(Hiroko Hatagami) అనే మహిళ స్థానిక అగ్నిమాపక విభాగం కార్యకలాపాలను అడ్డుకుందనే అనుమానంతో గురువారం అరెస్టు చేశారు. కానీ ఆ తరువాత విషయం తెలిసి పోలీసులు షాకయ్యారు. ఆమె గత రెండు సంవత్సరాల తొమ్మిది నెలలుగా తన మొబైల్ ఫోన్ లేదా వేరే ఫోన్ ల ద్వారా పదేపదే అత్యవసర కాల్స్ చేసిందని చిబా ప్రిఫెక్చురల్ పోలీసులు పసిగట్టారు.

ఇంతకీ ఇన్ని కాల్స్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే ఆమె చెప్పిన జవాబు భరించలేని ఒంటరితనమట. తన మాటల్ని ఎవరైనా వినాలని, తను ఎవరితోనైనా మనసువిప్పి మాట్లాడాలని, ఆమె కోరుకొనేదట. ఈ కారణంతోనే ఆగస్ట్ 2020 నుంచి మే 2023 మధ్య కడుపు నొప్పి, మాదకద్రవ్యాల అధిక మోతాదు, కాళ్లు నొప్పులు, ఆ నొప్పి, ఈ సమస్య అంటూ ఇలా రకరకాల ఫిర్యాదు చేస్తూ, అంబులెన్స్‌లను పంపమని మాట్సుడో అగ్నిమాపక శాఖకు కాల్స్ చేసింది.

సరిగ్గా అంబులెన్స్‌ వచ్చినప్పుడు మాత్రం ఆమె ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించేది. అసలు తాను ఎవరికీ కాల్ చేయలేదని, ఏదో పొరపాటున ప్రెస్ అయిపోయింది అని చెప్పి తప్పించుకొనేది. అయితే ఇలా పదే పదే జరగడంతో అగ్నిమాపక శాఖ, పోలీసులు అనేక హెచ్చరికలు చేశారు. అయినా సరే మహిళ తన అలవాటు మానుకోలేక పోయింది. చివరికి అగ్నిమాపక శాఖ విసిగిపోయి జూన్ 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

 

Also Read : WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై భద్రత విషయంలో నో టెన్షన్?